వీకెండ్స్ వస్తే చాలు.. చాలా మంది ఎటు వైపు వెళ్దాం, ఎలా ఎంజాయ్ చేద్దాం.. అని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే తమకు సమీపంలో ఉన్న టూరిస్టు ప్లేస్‌లకు వెళ్తుంటారు. అయితే చాలా వరకు టూరిస్టు ప్లేస్‌ల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో టూరిస్టు ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే ప్రదేశం కూడా అదే కోవకు చెందుతుంది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది.. దీని స్పెషాలిటీ ఏంటి..? అంటే..
తెలంగాణలో ఈ టూరిస్టు ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ ప్లేస్ వరంగల్ నుండి హైదరాబాద్‌కు పోయే దారిలో మడికొండ వద్ద కుడి వైపు తిరిగి 10 కిమీ వెళితే వస్తుంది. అదే ముప్పారం గ్రామం. ముప్పారం గ్రామం చెఱువు గట్టున ఉన్నది ముఖ్యనాథుని గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది.
పక్కనే ఇనుపరాతి గట్లు ఉంటాయి. ట్రెక్కింగుకు చాలా అనువైనది. బాహుహలి సినిమాలో మీరు చూసిన జలపాతం తమ్ముడు ఈ గట్లలో మీకు కనిపిస్తాడు, చిన్ని జలపాతం. చెఱువు గట్టు నుండి చూస్తే మీకు ముఖ్యనాథుని గుడి, గట్లు కనువిందు చేస్తాయి. ఒకసారి వెళ్లి చూడండి. వారాంతంలో పీస్ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఒక్కసారి ఈ ప్లేస్‌ను సందర్శించండి. మిమ్మల్ని మీరే మైమరిచిపోతారు.