Off Beat

హంస అనే పక్షి నిజంగా ఉందా? ఎవరయినా చూశారా?

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4, 5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి.

వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.

is swans are real

హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో హంసల గూర్చి అతిశయోక్తిగా చెప్పబడింది.

Admin

Recent Posts