వినోదం

సీరియల్ ఆర్టిస్ట్ నుంచి పాన్ హీరోగా ఎదిగిన రాఖీ భాయ్.. సక్సెస్ స్టోరీ ఇదే!

కన్నడ హీరో యష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే హీరో యష్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని భువనహళ్లి అనే గ్రామంలో అరుణ్ కుమార్, పుష్ప దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి కెఎస్ఆర్ టిసి లో బస్సు డ్రైవర్ గా పనిచేయగా, తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలను చేపట్టారు. ఈ హీరో కి నందిని అనే ఒక సోదరి కూడా ఉంది. యష్ చిన్నప్పటి రోజులు అన్నీ కూడా మైసూర్ లో గడిచిపోయాయి. ఈయన మహాజన ఎడ్యుకేషన్ సొసైటీ (MES)లో తన ప్రీ యూనివర్సిటీ కోర్సు (PUC)చేశాడు. చదువు పూర్తి చేసుకున్న అనంతరం యష్ ప్రముఖ నటనకారుడు BVకారత్ స్థాపించిన బెనక నాటక బృందంలో చేరాడు.

ఈ విధంగా నాటక బృందంలో చేరిన ఆ తర్వాత కన్నడ ఈటీవీలో అశోక్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన నందగోకుల టీవీ సీరియల్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. ఈ విధంగా టీవీ ఆర్టిస్ట్ గా మొదలైన తన ప్రయాణం అంచలంచలుగా ఎదిగింది. ఈ విధంగా పలు సీరియల్స్ లో నటించిన 2008లో శశాంక్ దర్శకత్వం వహించిన మొగ్గిన మనసులో నటించాడు. అక్కడ అతను తన నందగోకుల సహానటి రాధికా పండిట్ తో కలిసి సహాయక పాత్రలలో నటించారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూ సినిమా అవకాశాలు అందుకున్న యష్, రాధిక పండిట్ తో కలిసి నాలుగు సినిమాల్లో నటించారు.

actor yash success story

2016 డిసెంబర్ 9వ తేదీన వివాహం చేసుకున్న ఈ జంట ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న యష్ 2017లో యశోమార్గా ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా కరువు ప్రాంతాలకు త్రాగునీటిని అందించారు. ఈ విధంగా తన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూనే 2018లో కేజిఎఫ్ చిత్రంలో నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి హీరో యష్ జీవితాన్నే మార్చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా కన్నడ పరిశ్రమలో 250 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ఈయన ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తిరకెక్కిన కే జి ఎఫ్ 2 చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించారు.

Admin

Recent Posts