business

హీరో హోండా కంపెనీ ఎందుకు విడిపోయింది.. కారణమేంటి..?

హీరో హోండా బైక్ అంటే ఒకప్పుడు ఎంతో ఫ్యాషన్. ఒకప్పుడు ఈ బైక్ ప్రతి ఇంట్లో ఉండేది. మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ బైక్ అంటే ఎంతో ఎమోషన్. మరి ఈ హీరో హోండా కంపెనీ 26 ఏళ్లు కలిసి పనిచేసి ఎందుకు విడిపోయింది.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఒక సారి చూద్దాం..? హీరో అనేది ఒక ఇండియా కంపెనీ, ఈ కంపెనీ మొదట్లో సైకిళ్లు తయారు చేస్తూ ఉండేది.

ఆ సైకిల్ కి అప్పట్లో చాలా క్రేజ్. ఇక హోండా జపాన్ కు చెందిన కంపెనీ. ఇది బైక్ లను తయారు చేసేది. 1984లో వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఏం అనుకున్నారంటే హీరో బైక్ యొక్క బాడీ ని తయారు చేయాలి, హోండా బైక్ యొక్క ఇంజన్ ను తయారు చేయాలి. ఈవిధంగా మెల్లి మెల్లిగా భారతదేశంలో హీరోహోండా ఫేమస్ అయిపోయింది. కానీ వీరి స్నేహానికి మధ్యలోనే బీటలు వారాయి. హోండా హీరో ని తొక్కేయాలని చూసింది. హోండా కంపెనీ హీరో బైక్స్ ని బయట దేశాల్లో అమ్మకుంటామంటే ఒప్పుకోలేదు.

why hero and honda companies got separated

దీంతో హీరో తన సొంత బైక్ ఇంజన్ ను తయారు చేసుకోవాలని భావించింది. దీంతో 2010లో సొంత ఇంజన్ ను తయారు చేశారు. తర్వాత విడిపోయే టైం రానే వచ్చింది. అలా హీరో హోండా రెండు ముక్కలయింది. హోండా కంపెనీ అంతకుముందే మార్కెట్లో ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇళ్లలో హోండా యాక్టివా బైకులు చూస్తూనే ఉంటాం. ఈ విధంగా హోండా విడిపోయి తమ బ్రాండ్ తో కొత్త బైక్ లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో హీరో బైకులు, మరియు హోండా బైకులు మనకు అందుబాటులోకి వచ్చాయి.

Admin

Recent Posts