Balakrishna Fan : నందమూరి బాలకృష్ణ.. అభిమానులకి ఆరాధ్య దైవం. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. బాలయ్య కొట్టిన తిట్టిన కూడా వారు ఆయనని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఓ వీరాభిమాని బాలయ్యపై ఉన్న అమితమైన ప్రేమతో వాగులో దికాడు. ఇది చూసి బాలయ్య ఖంగుతిన్నాడు. వివరాలలోకి వెళితే నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన హిందూపురం నియోజకవర్గం లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. స్థానికులు అందరితో మాట్లాడిన బాలకృష్ణ బాధితులకు అండగా ఉంటానని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే . అక్కడి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్న క్రమంలో బాలయ్య ని చూడాలని వంతెన అవతలి గట్టుపై ఉన్న అభిమానులు, ఒక్కసారిగా నది ఇవతలి వైపు వచ్చే ప్రయత్నం చేశారు. ఓ అభిమాని ఆవేశ పడి ఇవతల వైపుకు రావాలనే ప్రయత్నం చేయగా స్థానికులు వారించారు. అయినా పట్టించుకోకుండా బాలకృష్ణ మీద అభిమానంతో ఓ అభిమాని బాలకృష్ణను చూడటం కోసం నీళ్లలోకి దూకి ఇవతలకు వచ్చే ప్రయత్నం చేశారు.
కానీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చివరకు సదరు అభిమానిని వేరే చోట ఉన్న కొందరు కాపాడి బయటకు తీశారు. ఇదేం పని అని అతని మీద కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమాన హీరోను చూడడం కోసం కొన్ని రిస్క్ లు చేసినా పర్లేదు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొనే పనులు చేయకూడదని కొందరు నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు.