వినోదం

జ‌య‌సుధ మొద‌టి భ‌ర్త ఎవ‌రో.. ఆయ‌న ఏం చేసేవారో తెలుసా..?

సహజ నటిగా పేరుందిన జయసుధ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. స్టార్ హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జయసుధ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు.

కానీ జయసుధ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. జయసుధ అసలు పేరు సుజాత. కాగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంత ఇచ్చింది. హీరోయిన్ గా కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ తో జయసుధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకు ప్రేమగా మారింది. జయసుధ రాజేంద్రప్రసాద్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ జయసుధ తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు.

do you know about jayasudha first husband

దాంతో జయసుధ రాజేంద్రప్రసాద్ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత జయసుధ తల్లితండ్రులు ఏమీ చేయలేక ఇద్దరికీ విజయవాడలో బంధువులు, స్నేహితుల మధ్యలో మరోసారి పెళ్లి జరిపించారు. రాజేంద్రప్రసాద్ ఓ వ్యాపారవేత్త కాగా జయసుధ హీరోయిన్. దాంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడిందట. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్ జయసుధను టార్చర్ చేయడం మొదలు పెట్టారట. ఆ టార్చర్ భరించలేక చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో తలదాచుకున్నారట. గొడవల గురించి స్టూడియో అధినేత నాగిరెడ్డికి జయసుధ వివరించారట. దాంతో సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ ను పిలిపించి పంచాయతీ పెట్టారట. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి జయసుధ ఆయనతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జయసుధ నిర్మాత నితిన్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

Admin

Recent Posts