ఆధ్యాత్మికం

హ‌నుమాన్ చాలీసాను ఎవ‌రు ర‌చించారు.. దీని వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీదాస్‌ తెలియని హిందువు ఉండరు&period; ఎందుకంటే ఆయన రాసిన రామచరిత్‌మానస్‌&comma; హనుమాన్‌ చాలీసా&comma; ఇతర దోహాలు అత్యంత పవిత్రమైనవే కాకుండా విశేష ప్రాచుర్యాన్ని పొందాయి&period; అయితే మహాత్ములు ఆయా సంఘటనలకు స్పందించిన సమయంలో ఆయా బృహత్తర రచనలు వెలువడుతాయనేది చరిత్ర మనకు చెప్తున్న సత్యం&period; అదే కోవకు చెందినది హనుమాన్‌ చాలీసా&period;&period; చాలా శక్తివంతమైనదిగా ప్రసిద్ధిగాంచిన ఈ చాలీసాను తులసీదాస్‌ ఎప్పుడు చెప్పాడు&comma; ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని రచించాడు అనే విషయాలు తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంత్‌ తులసీదాస్‌ క్రీ&period;à°¶&period; 16à°µ శతాబ్దంలో ఉత్తరభారతంలో నివసించేవాడు&period; ఆ సమయంలో దేశాన్ని మొఘలు చక్రవర్తులు పరిపాలిస్తుండేవారు&period; తులసీదాస్‌ను అందరూ సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు&period; ఇలా ఉండగా ఒకనాడు వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్తుడు ఒకరు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు&period; వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా&comma; విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు&period; జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79684 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-hanuman-1-1&period;jpg" alt&equals;"dp you know who written hanuman chalisa " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను&comma; బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా&comma; శవయాత్ర సాగిపోతున్నది&period; స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్‌ ఆశ్రమం మీదుగానే సాగుతుంది&period; శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్‌ పాదాలపై పడి విలపించసాగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధ్యాననిమగ్నులైన తులసీదాస్‌ కనులు తెరిచి దీర్ఘసుమంగళిభవః అని దీవించాడు&period; దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి&comma; జరుగుతున్న శవయాత్ర చూపించింది&period; వెంటనే తులసీదాస్‌ తల్లీ&excl; రాముడు నా నోట అసత్యం పలికించడు&excl; అని శవయాత్రను ఆపి&comma; శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి&comma; తన కమండలంలోని జలాన్ని చల్లాడు&period; ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు&period; దీంతో తులసీదాస్‌ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది&period; ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు&period; ఢిల్లీ పాదుషా తులసీదాస్‌ ను విచారణకు పిలిపించాడు&period; విచారణ ఇలా సాగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79685" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-hanuman-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదుషా- తులసీదాస్‌ జీ &excl; మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట &excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీదాస్‌- అవును ప్రభూ &excl; ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు &excl; రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదుషా – అలాగా &excl; రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు&period; నిజమేనా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీదాస్‌ – అవును ప్రభూ &excl; రామనామానికి మించినదేమీ లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదుషా&colon;- సరే&comma; మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము&period; దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి&period; అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీదాస్‌ &colon;- క్షమించండి ప్రభూ &excl; ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి&period; మానవమాత్రులు మార్చలేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదుషా &colon;- తులసీదాస్‌ జీ&excl; మీ మాటను నిలుపుకోలేక&comma; మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు&period; మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీదాస్‌ &colon;- క్షమించండి &excl; నేను చెప్పేది నిజం &excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి&comma; తులసీ &excl; నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను&period; నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో&excl; లేదా శవాన్ని బ్రతికించు&excl; అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు&period; అప్పుడు తులసీదాస్‌ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు&period; అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్‌ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79686" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tulsidas&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే &excl; ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్‌ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని&comma; వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి&period; ఈ హఠాత్‌ సంఘటనతో అందరూ హడలిపోయి&comma; ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు&period; ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్‌ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు&period; ఒడలు పులకించిన తులసీదాస్‌ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు తులసీ &excl; నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది&period; ఏమికావాలో కోరుకో&excl; అన్నాడు&period; అందుకు తులసీదాస్‌ తండ్రీ&excl; నాకేమి కావాలి &excl; నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు&comma; నా జన్మచరితార్థమవుతుంది&period; నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా&comma; వారికి అభయం ప్రసాదించు తండ్రీ&excl; అని కోరుకున్నాడు&period; ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు తులసీ&excl; ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా&comma; వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటివరకు హనుమాన్‌ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అపర వాల్మీకియైన తులసీదాస్‌ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్‌ చాలీసా&period; అందడీ సంగతి పవిత్రమైన పవర్‌ఫుల్‌ అయిన హనుమాన్‌ చాలీసా అలా పుట్టింది&period; ఇక ఆలస్యమెందుకు చాలీసాను భక్తి&comma; శ్రద్ధలతో పారాయణం చేయండి హనుమాన్‌ అనుగ్రహానికి పాత్రులు కండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts