Off Beat

క‌ళ్ల జోడు ఉన్న‌వారు స‌ర్జ‌రీ చేయించుకుంటే అద్దాల‌ను వాడాల్సిన ప‌నిలేదా..?

కళ్ళజోడు ఉన్నవారు లేజర్ ఆపరేషన్ చేయించుకుంటే కళ్ళజోడు ఇక అవసరం పడదని చెప్తారు. ఆ ఆపరేషన్ బాగానే సక్సెస్ ఫుల్ అవుతుందా? ఏమైనా సమస్యలు ఉంటాయా? నేను దాదాపు ఏడు సంవత్సరాల పాటు కళ్ళజోడు వాడాను.. ఆ తర్వాత 2015 ఏప్రిల్ లో లేజర్ సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ జరిగినపుడు నా వయస్సు 21 సంవత్సరాలు.. ఇప్పుడు నా వయస్సు 29.. ఈ మధ్య కాలంలో ఎటువంటి సమస్యా రాలేదు… ఆసుపత్రివారు ముందే అన్ని విధాలుగా కౌన్సెలింగ్ చేసారు.. అన్ని వివరాలు వివరంగా తెలిపారు..మీకు ఒక యాభై సంవత్సరాలు వచ్చేవరకు మళ్ళీ మీకు కళ్ళజోడు వాడే అవసరం రాదు.. ఆ తర్వాత ఒకవేళ అవసరం వచ్చినా సాధారణంగా తక్కువ పాయింట్ ఉన్న అద్దాలు వాడితే సరిపోతుంది అని చెప్పారు..

అందరికి కళ్ళ ఆరోగ్య స్థితి ఒకే రకం గా ఉంటుందని చెప్పలేం కదా.. సమస్య ఉన్నవారు మంచి నేత్ర వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు పాటిస్తూ సర్జరీ చేయించుకుంటే మంచి ఉపయోగం ఉంటుందనే అనుకుంటున్నాను…

can forget about glasses if we do surgery to eyes

నన్ను చూసి మా చుట్టాలమ్మాయి కూడా దాదాపు రెండేళ్ల క్రితం చేయించుకుంది.. తనకి కూడా ఎలాంటి సమస్యా లేదు ఇప్పటివరకు…సర్జరీ కి ఖర్చు యాభై ఐదు వేల దాకా అయింది కంట్లో వేసుకునే చుక్కల మందులు ఇతరత్రా అన్నీ కలుపుకొని..

మొదట్లో భయం ఉండేది ఇన్ని డబ్బులు పోసి సర్జరీ చేసుకుంటే తర్వాత ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని.. కానీ డబ్బులు పోయినా ఫలితం అయితే దక్కింది మా విషయంలో…

Admin

Recent Posts