Thaman : సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు థమన్. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే థమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది. థమన్ మెగాస్టార్ గాడ్ ఫాదర్, శివ కార్తికేయన్ ప్రిన్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.
అయితే ఇప్పటివరకు థమన్ పడిన స్ట్రగుల్స్ గురించి విన్నామే కానీ థమన్ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే థమన్ కు పెళ్లి అయ్యిందా..? లేదా ..? అనేది కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే థమన్ చాలా ప్రైవేట్ పర్సన్.. ఏ ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి రాలేదు. సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఇన్నాళ్లకు ఆయన తన భార్య గురించి బాహాటంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చాడు.
నా భార్య వర్ధిని వాయిస్ బాగుంటుంది. ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి.. వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడిస్తాను. వర్ధినితో స్టేజ్ షో లు చేయాలి అనేది నా డ్రీమ్.. వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె 3, 4 పాటలతో హిట్ అవ్వాలి. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తాం.. ఇక నా కొడుకే నా ట్యూన్స్ ను మొదట వింటాడు. అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై మంచి పట్టు వచ్చింది. ఫ్యూచర్ లో వాడు ఏమి కావాలో వాడే డిసైడ్ అవ్వాలి అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం థమన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.