వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చిరంజీవి ఎప్పుడు ఎలా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారంటే..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఈ పేరు సంచ‌ల‌నం. ఆయ‌న ‘మెగాస్టార్’ చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా త‌ర్వాత తర్వాత త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్‌గా అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చేవారు వారు ఎందరో ఉన్నారు. ఇందులో సినీ సెల‌బ్రిటీలు సైతం ఉండ‌డం విశేషం. అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌లోను త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే మొద‌ట ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌డానికి చిరు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. చాలా మంది ద‌ర్శ‌కుల‌ను చెక్ చేసుకున్న త‌రువాత చివ‌రికీ ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) కుదిరాడు. ప‌వ‌న్ పోస్ట‌ర్ డిజైన్ కొత్తగా చేశారు ఈవీవీ. అయితే ఈ అబ్బాయి ఎవ‌రూ అంటూ ఒక వాల్ పోస్ట‌ర్ సంధించారు. ఆ త‌రువాత సినిమా విడుద‌ల‌కు ముందు ఇత‌డే మ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. దీంతో అంద‌రిలో ఆ అబ్బాయిపై ఆస‌క్తి పెరిగింది. చిరంజీవి త‌మ్ముడు అనే స‌రికి జ‌నాల‌లో క్యూరియాసిటీ ఎక్కువైంది.

do you know how chiranjeevi introduced pawan kalyan to movie industry do you know how chiranjeevi introduced pawan kalyan to movie industry

ఇక అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో ప‌వ‌న్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. అయితే ఒక పెద్ద ఈవెంట్‌ను జ‌రిపి చిరంజీవి మెగాఫ్యాన్స్‌కు ఇత‌ను నా త‌మ్ముడు అంటూ ప‌రిచ‌యం చేశాడు. తాజాగా ఇందుకు సంబంధించి పిక్ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ పిక్‌లో చిరంజీవి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు నాగ‌బాబు కూడా క‌నిపిస్తారు. ఇక ఈ సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి షూటింగ్ జ‌రిగిన‌న్నీ రోజులు నెల‌కు రూ.5వేలు ఇచ్చార‌ట నిర్మాత అల్లు అర‌వింద్‌. అక్టోబ‌ర్ 11, 1996లో విడుద‌ల అయిన ఈ సినిమా 32 సెంటర్ల‌లో 50 రోజులు, రెండు సెంట‌ర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక అక్క‌డ నుండి మొద‌లైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్థానం భీమ్లా నాయ‌క్ వ‌ర‌కు సాగింది.

Admin

Recent Posts