హెల్త్ టిప్స్

Nutrients For Brain : ఈ పోష‌కాల‌ను రోజూ తీసుకోండి.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Nutrients For Brain : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే మనం ఏ పని చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా మన మెదడు బాగా పని చేయాలి. మెదడు బాగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం బాగుండడానికి ఎటువంటి పోషకాలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మెదడు ఆరోగ్యం కోసం ఈ పోషకాల‌ను క‌చ్చితంగా తీసుకుంటూ ఉండాలి.

అప్పుడే మెదడు పని తీరు బాగుంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. మెద‌డు అభివృద్ధికి క‌చ్చితంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుండే ఆహార పదార్దాలని తీసుకోవాలి. ఐరన్ ని కూడా కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. మెదడు పనితీరుపై ఐరన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు బాగా పనిచేయడానికి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండడానికి విటమిన్ బి12 కూడా అవసరం.

take these foods daily your brain will work as fast as computer

విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మూడ్ కూడా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి అవసరం. అలాగే మెదడు పనితీరుపై కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. కాబట్టి విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి తో డిమెన్షియా రిస్క్ కూడా ఉండదు. మెదడు ఆరోగ్యానికి జింక్ కూడా అవసరం.

అలాగే విటమిన్ ఇ కూడా మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ ఇ ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మెగ్నీషియం కూడా రోజు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి. మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉంటే మైగ్రేన్, డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటాయి. మెదడు పని తీరుకి క్యాల్షియం కూడా అవసరం. విటమిన్ కె, సెలీనియం కూడా మెదడు ఆరోగ్యానికి అవసరమే. ఈ పోషక పదార్థాలని కనుక మీరు రోజు వారి ఆహారంలో తీసుకున్నట్లయితే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది.

Admin

Recent Posts