వినోదం

Pawan Kalyan : చిరంజీవిని తిట్టిన వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశాడో తెలుసా..?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ .. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. అయితే ఎంత ఎదిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం త‌న‌కు స‌పోర్ట్ ఇచ్చిన వారిని అస్స‌లు మ‌రువడు. చిరంజీవి అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి దేవుడితో స‌మానం. అప్ప‌ట్లో చిరంజీవి విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రౌడీలతో పెద్ద గొడ‌వ ప‌డ్డాడ‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త‌మిళ‌నాడుకు చెందిన ఓ రౌడీతో అప్ప‌ట్లో గొడ‌వ జ‌రిగింది. చిరు.. కోడి రామ‌కృష్ణ సినిమా షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో తమిళ‌నాడులోని చెన్నై ప‌రిస‌ర ప్రాంతంలో నివాసం ఉండేవాడు.

కోడిరామ‌కృష్ణ కూడా చిరుతో చెన్నై లోని కోడంబాకం ప‌రిస‌రప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డ కొంద‌రు లోక‌ల్ గూండాలు వ‌చ్చి తిట్ట‌డం, కామెంట్లు చేయ‌డం చేశార‌ట‌. ఈ విష‌యం చిరు కార్ డ్రైవ‌ర్ వెళ్లి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెప్ప‌డంతో, అప్పుడు వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఆ గూండాల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. ఆ స‌మ‌యంలో కుప్పుస్వామి అనే రౌడీకి గాయాల‌య్యాయి. ఈ విష‌యం తెలుసుకున్న‌చిరు వెంట‌నే హాస్పిట‌ల్ కు వెళ్లి కుప్పుస్వామిని ప‌రామ‌ర్శించాడు. అంతే కాకుండా మ‌రోసారి ఇలాంటి గొడ‌వ‌ల‌కు వెళ్లొద్దంటూ ప‌వ‌న్ కు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌.

what pawan kalyan did after chiranjeevi get scolded

ఇక చిరంజీవి ఇప్ప‌టికీ త‌న త‌మ్ముడికి అండ‌గానే ఉంటాడు. ఇటీవ‌ల పవన్ కళ్యాణ్, జన సేన గురించి స్పందించాల్సిన సమయం వచ్చింది. గతంలో ఓ సారి చిరు మాట్లాడుతూ.. ఇంట్లోనే ఓ పార్టీ ఉండగా.. వేరే పార్టీలకు ఎందుకు మద్దతిస్తాను.. నా తమ్ముడికే మద్దతిస్తాను అని చిరంజీవి అన్నాడట. ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రెస్ మీట్‌లో ప్రస్థావించాడు. మీరు నాతో ఫోన్ ఇంటర్వ్యూలో అలా అన్నారు.. ఇప్పుడు కూడా అదే మాట మీదున్నారా? అని చిరంజీవిని ప్రశ్నించాడు. ఆ స‌మ‌యంలోతన తమ్ముడి నిబద్దత గురించి తనకు తెలుసు అని, తన లాంటి నాయకులు రావాలని కోరుకున్నాడు. తాను ఒక పక్క.. తన తమ్ముడు ఒక పక్క ఉండటం ఎందుకు.. తాను పక్కకి తప్పుకుంటే.. తన తమ్ముడు ఎమర్జ్ అవుతాడనిపిస్తుందంటూ చిరంజీవి అన్నాడు.

Admin

Recent Posts