హెల్త్ టిప్స్

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం తినడం సాధారణం. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. రోజూ అన్నం తినే వారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. వైట్ రైస్ తినడం వలన కలిగే నష్టాలేంటో చూద్దాం.

శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తినడం వలన ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం వంటి సమస్యలు వేధిస్తాయి. బియ్యం పై పొరలో విటమిన్‌ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు. లిసిధిన్‌ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పని చేస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు. పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేకపోవడంతో మలబద్ధకం వస్తుంది.

if you are taking white rice daily then you are in danger

ఎన్ని మందులు వాడినా తగ్గదు. అలాగే బరువు పెరుగుతారు. తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతుంటాయి. నమలనందున నోటిలో గానీ, పొట్టలో గానీ జీర్ణక్రియ సరిగా ఉండదు. శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పైగా తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది.

Admin

Recent Posts