వినోదం

కమలహాసన్ ఆ సినిమాలో బాలనటుడిగా అల్లు వారబ్బాయి..ఎవరంటే..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.. అయితే అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ కాకుండా మరో వ్యక్తి కూడా కమలహాసన్ తో ఒక సూపర్ హిట్ సినిమాలో బాలనటుడిగా నటించి ప్రస్తుతం సినిమాల్లో కనబడడం లేదు.. కానీ ఒకటి రెండు సినిమాల్లో ముఖ్యంగా స్టార్ హీరో కమల్ హాసన్ సినిమాలో కనిపించడం ఆయన అదృష్టం అని చెప్పుకుంటారు.. మరి ఇంతకు అల్లు వారి అబ్బాయి ఎవరో ఒకసారి చూద్దాం.. భారతీయ చలనచిత్ర రంగంలో హీరో కమలహాసన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం.

దశావతారం, భారతీయుడు, స్వాతిముత్యం వంటి సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు ఆయన.. అందుకే ఆయనతో నటించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం అదృష్టంగా భావిస్తారు. అలాంటి అదృష్టాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీకీ దక్కిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం అల్లు బాబి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, సహనిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన బాలనటుడిగా కమలహాసన్ సినిమా లోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి విజేత మూవీ లో కూడా చేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ అల్లు అరవింద్ ల మధ్య మంచి పరిచయం ఉంది.

do you know that allu bobby acted with kamal haasan

అయితే విశ్వనాథ్ షూటింగ్ టైం లో అప్పుడప్పుడు అల్లుఅరవింద్ అక్కడికి వెళ్లేవారట.. అయితే స్వాతి ముత్యం సినిమాలో చిన్న పిల్లల క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో అల్లు అరవింద్ తన పెద్ద కుమారుడు బాబీని తీసుకుని వెళ్లారట.. ఈ క్రమంలోనే కళాతపస్వి ఆ బాబి ని చూసి మా సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం మీ బాబును తీసుకోవచ్చా అని అడిగారట. దీంతో అల్లు అరవింద్ ఓకే చెప్పి హామీ ఇచ్చారు.. ఈ సినిమాలో నటుడు కమలహాసన్ మనవడిగా బాల నటుడిగా నటించారు బాబీ.. ఈ విధంగా ఆయన చిన్నతనంలోనే సినిమాల్లో నటించారు. ఇప్పటికే బాబి తమ్ముడు అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.

Admin

Recent Posts