వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ – అన్నా లెజినోవా మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా..?

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే చాలా సింపుల్‌గా ఉండే ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌తో ఇటీవ‌ల తెగ వార్త‌లలో నిలుస్తున్నాడు. విజ‌య‌వాడ‌కి చెందిన నందిని అనే అమ్మాయిని ముందు వివాహ‌మాడిన ప‌వ‌న్ త‌ర్వాత రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్ల త‌ర్వాత విడాకులు తీసుకున్నాడు. ఇక ముచ్చ‌ట‌గా మూడోసారి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆమెతో సాఫీగా దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారు.

రష్యా దేశస్తురాలైన అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్న ప‌వ‌న్ ఇప్పుడు ఆమెని చాలా బాగా చూసుకుంటున్నాడు.. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించి ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా లెజ్నోవా, పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కలిశారట. అప్పుడే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని టాక్. ఇక తర్వాత రేణు దేశాయ్ కు 2013లో విడాకులు ఇచ్చిన పవన్ అన్నా లెజ్నోవాతో ఏడడుగులు వేశారు. ఇక రష్యా సాంప్రదాయాలను మర్చిపోయి పవన్ భార్యగా మారిన తర్వాత భారతీయ మహిళగా మారింది అన్నా లెజ్నోవా.

do you know that how pawan and anna were in love

అస‌లు వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఒక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది. ప‌వ‌న్‌ని చాలా మంది హీరోగా క‌న్నా కూడా మంచి మ‌నిషిగా ఇష్ట‌ప‌డుతుంటారు. ఎన్నో దానధర్మాలు చేస్తారు. ఇక అన్నా లెజ్నోవా కూడా అలాగే దానధర్మాలు చేస్తూ గొప్ప మనసు కలిగి ఉన్నారట. అందుకే ఇక వీరిద్దరి మన‌సులు కలిసాయని వీరికి దగ్గరగా ఉండే స్నేహితులు చెబుతూ ఉంటారు. ఇక పవన్ మాదిరిగానే అన్నా లెజ్నోవా కూడా సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారట. క్రైస్తవ మతానికి చెందిన మహిళ అయినప్పటికీ భారతదేశ ఆచారాలని అన్నా నేర్చుకున్నారు. సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉండే అన్నా… బ‌య‌ట కూడా చాలా అరుదుగా క‌నిపిస్తుంటుంది.

Admin

Recent Posts