Sobhan Babu : శోభన్ బాబు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడుగా శోభన్ బాబు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఈయనను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే.. టీవీలకు అతుక్కుపోయే వీరాభిమానులున్నారు. యూట్యూబ్‌లో కూడా శోభన్ బాబు సినిమాలకు గిరాకీ ఎక్కువే. అంతేకాదు సినిమాలకూ ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన సోగ్గాడు. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.
శోభన్ బాబు తనతోపాటు వర్క్ చేసే నటీనటుల పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారట. కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యారట. అంతేకాదు.. సెట్ లోనే ఆమెను అవమానించారట. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఎప్పుడూ సహనంగా.. సరదాగా ఉండే అందాల నటుడికి అంతగా కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు అంటే నగ్మా. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన నగ్మా శోభన్ బాబుతో కలిసి చాలా చిత్రాలలో నటించింది.
అడవి దొర సినిమాలో శోభన్ బాబు సరసన నగ్మా కథానాయికగా నటించగా, ఈ అమ్మడితో పాటు సురభి కూడా మరో కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్రయూనిట్ అక్కడికి వెళ్లింది. అయితే అందరూ వచ్చినా కానీ.. నగ్మా మాత్రం అక్కడికి రాలేదట. ఆమె కోసం చిత్రయూనిట్ మొత్తం దాదాపు గంటపాటు వెయిట్ చేశారట. ఆ తర్వాత గంటన్నరకు సెట్ లోకి వచ్చారట నగ్మా. ఆలస్యంగా రావడమే కాకుండా.. అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు చెప్పకపోవడంతో శోభన్ బాబు ఆగ్రహానికి గురయ్యారట. దీంతో నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందని అడగడంతో స్టన్నింగ్ సమాధానం ఇచ్చిందట. దీంతో వెంటనే నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి. బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి ఉంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్ అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.