వినోదం

Posani Krishna Murali : ఎప్పుడూ న‌వ్విస్తూ ఉండే పోసాని జీవితంలో అంత పెద్ద విషాదం ఉందా..?

Posani Krishna Murali : పోసాని కృష్ణముర‌ళి.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేనిది. ఇప్పుడు చాలా మంది ఆయ‌న‌ను కామెడిగా చూస్తున్నారు గాని ఒకప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉండేది. దర్శకుడిగా, రైటర్ గా ఆయనకు చాలా డిమాండ్ ఉండేది. అగ్ర హీరోలకు మంచి కథలు, మాటలు అందించిన పోసాని ఇప్పుడు ఎందరో యువ దర్శకులకు గురువుగా ఉన్నారు. ఆయన తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా చాలా మంది కెరీర్ నిలబెట్టాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ కొట్టిన బాబి కూడా ఆయన దగ్గరే పని చేసారు.

పోసాని ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నారు. అలానే రాజకీయాల్లో కూడా ఆయన సీరియస్ గానే ఫోకస్ చేసారు. అయితే ‘సుమ అడ్డ’ షోలో అలీతో పాటుగా పాల్గొన్నారు పోసాని. ఈ క్రమంలోనే తన తండ్రి మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైయ్యారు. మా నాన్నకు మొదట ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పిన పోసాని త‌ర్వాత ఆయ‌న‌కు ఎవ‌రో పేకాట నేర్పారని చెప్పాడు.

do you know that Posani Krishna Murali has sad in his life

ఊళ్లో ఎవరో ఒకరు ఎందుకు సుబ్బారావు ఈ విధంగా చేస్తావు కదా అని అడిగారని అలా అడగటం వల్ల ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోలేకపోయారు. దాంతో మ‌న‌స్థాపానికి లోనైన ఆయ‌న పొలానికి వెళ్లి చనిపోయారని తెలిపారు. మ‌న‌ల్ని ఎప్పుడు ఎంతో న‌వ్వించే పోసాని జీవితంలో ఇంతటి విషాదం ఉందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక పోసాని రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆయన సినిమాకు పది నుంచి 15 లక్షల వరకు తీసుకుంటున్నారు. పరుచూరితో ఉన్న అనుబంధంతో ఆయన సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు.

Admin

Recent Posts