హెల్త్ టిప్స్

Honey : తేనె వ‌ల్ల ఎన్ని వ్యాధులు న‌యం అవుతాయో తెలుసా.. రోజూ తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..

Honey : ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న సమస్య డయాబెటిస్. జీవనశైలిలో మార్పు కావచ్చు, తీసుకునే ఆహారంలో పోషక లోపం వలన కావచ్చు నూటికి 90 శాతం మంది ప్రస్తుత కాలంలో డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి తేనె అనేది బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు ద్వారా వెళ్లడయ్యింది. రెండు టేబుల్‌స్పూన్ల తేనె తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేయడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.

టొరంటో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 1,100 కంటే ఎక్కువ మంది పాల్గొనేవారితో సహా 18 ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించారు. ఒకే రకం పూల నుండి లభించే తేనె శరీరంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు. తేనె రక్తంలో గ్లూకోజ్ మరియు తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్ సంఖ్యను తగ్గించిందని వారు కనుగొన్నారు. తేనెను తీసుకోవడం వల్ల అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌లు (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతాయని మెరుగుపరిచే సంకేతాలను చూపించింది.

do you know how many diseases honey will cure

తేనెలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరిన్, ఇనుము, ఫాస్ఫరస్, సల్ఫర్, అయొడిన్, లవణాలు బాగా ఉంటాయి. కొన్ని రకాల తేనెలలో చివరికి రేడియం కూడా వుంటుంది. తేనెలో మాంగనీసు, అల్యూమినియం, బోరాన్, క్రోమియం, రాగి, లిథియం, నికెల్, సీసం, తగరం, టైటానియం, జింక్, ఆస్మియం లవణాలు కూడా ఉంటాయని నిరూపితమైంది.

తేనె ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి, శ్లేష్మాన్ని హరింపజేసి దగ్గును తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ఆహారంలో చేర్చబడిన స్వీటెనర్‌లను టీలో చక్కెర వంటి వాటిని తేనెతో భర్తీ చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు మరియు ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు తగ్గిస్తుందని, ఎక్కువ చక్కెర తినడం వల్ల వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు.

Admin

Recent Posts