వినోదం

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Sai Pallavi : సాయి ప‌ల్లవి.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఫిదా చిత్రంతో ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సాయి ప‌ల్లివి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది . లేడి ప‌వర్ స్టార్ అనే బిరుదు కూడా ద‌క్కించుకుంది. వరుసగా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలతో అలరించింది సాయి పల్లవి. కథ నచ్చి, అందులో కంటెంట్ ఉంటేనే సాయి పల్లవి ఓకే అనేది. సాయి పల్లవి మలయాళం అమ్మాయి అయినప్పటికీ రెండు మూడు సినిమాలతో ఆమె తెలుగమ్మాయి అనేంతలా గుర్తింపు తెచ్చుకుంది.

సాయి పల్లవికి పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పదని టాక్. అయితే సాయి ప‌ల్ల‌వి చైల్డ్ ఆర్టిస్ట్ అనే విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. కంగ‌నా ర‌నౌత్ ముఖ్య‌పాత్ర‌లో న‌టిచిన త‌మిళ సినిమా దామ్ దూమ్ లో సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తుంది. ఇక ఈ సినిమా చేసిన స‌మ‌యంలో సాయిప‌ల్ల‌వి వ‌య‌సు కేవ‌లం ఆరేళ్ల‌న‌ట‌. ఏదో టైం పాస్ కోసం ఈ సినిమా చేశాన‌ని చెప్పిన సాయి ప‌ల్లవి.. దీనిని డెబ్యూ మూవీగా అంగీక‌రించ‌ను అని చెప్పింది.

do you know that sai pallavi acted as child artist in one movie

అయితే సాయి ప‌ల్ల‌వి మీద ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. అప్ప‌ట్లో డేట్స్ ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల నాని నేను లోకల్ సినిమాకు అకస్మాత్తుగా రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత దిల్ రాజు చెప్పేశారు. ఇక సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందంటేనే అందులో మినిమమ్ కంటెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆమెను చూసి సినిమాపై ఇంట్రెస్ట్ చూపించే జనాలు అనేకం. మిగతా హీరోయిన్లల గ్లామర్, స్కిన్ షోకి సాయి పల్లవి దూరంగా ఉంటుంది..ఎలాంటి పాత్ర అయిన తన పరిధి మేరకు మాత్రమే నటిస్తూ దూసుకుపోతోంది.

Admin

Recent Posts