వినోదం

సౌందర్య చనిపోవడానికి ముందే ఆమెకు 3 ప్రమాదాలు జరిగాయట..?

టాలీవుడ్‌ హీరోయిన్, అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది.. ఆమె తండ్రి సినీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో ఈమె కూడా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతికొద్ది కాలంలోనే పెద్ద స్టార్ గా మారిపోయింది.. ఎంత తొందరగా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే తొందరగా విమాన ప్రమాదంలో మరణించింది.

ఇది ఇలా ఉంటే, ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సౌందర్య గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలో తాను నటించకపోవడానికి గల కారణాల గురించి మానవ కోటేశ్వరరావు మాట్లాడుతూ, కొన్ని పాత్రలలో నటించాలంటే తనకు భయమని ఆయన వెల్లడించారు. ఔట్ డోర్ షూటింగులు ఎక్కువ రోజులు ఉంటే కూడా తాను ఆ సినిమాలలో నటించే వాడిని కాదని ఆయన పేర్కొన్నారు.

do you know that soundarya escaped from 3 accidents before her death

శివ్ శంకర్ సినిమా షూటింగ్ సమయంలో లైట్ మ్యాన్ పైనుంచి సౌందర్య ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ పడ్డారని తెలిపారు. పైనుంచి వచ్చే శబ్దం విని ఆమె పక్కకు వెళ్లారని, 15 అడుగుల నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారని కోటేశ్వరరావు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో మరో రెండు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. సౌందర్య నటించిన చివరి సినిమా శివ్ శంకర్ కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

Admin

Recent Posts