వినోదం

ఓకే హీరోకు తల్లిగా,భార్యగా నటించిన 6 హీరోయిన్స్ ..!

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వీరంతా సినిమా వరకు మాత్రమే వీటిని పట్టించుకుంటారు తప్ప నిజ జీవితంలో వారి లైఫ్ వేరు. అలాంటి ఇండస్ట్రీలో ఒక హీరోతో హీరోయిన్ గా నటించిన కొంత మంది కొంతకాలం తర్వాత అదే హీరోకి తల్లి పాత్రలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలనాటి భానుమతి నుంచి ఇప్పటి అనుష్క శెట్టి వరకు అనేక ఘటనలు ఉన్నాయి. ఎన్టీఆర్,కృష్ణ,ఏఎన్నార్ నుంచి నేటి ప్రభాస్ వరకు అలాంటి పాత్రను ఎదుర్కొన్న వారే. మరి అలాంటి హీరోయిన్ ఎవరో మనము ఒకసారి చూద్దాం..

భానుమతి : భానుమతి పేరు వినగానే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అనే విషయం గుర్తుకు వస్తుంది. అలాంటి ఆమె 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించింది. శారద : ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తో ఇంద్రధనస్సు వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి అగ్ని కెరటాలు, రౌడీ నెంబర్ వన్ సినిమాల్లో కృష్ణకు తల్లిగా చేసింది. అంజలీదేవి : నాగేశ్వర రావు తో కలిసి ఎన్నో సినిమాల్లో ఆడి పాడింది. దీని తర్వాత చాలా సినిమాల్లో ఏఎన్నార్ కి తల్లిగా నటించింది అంజలీదేవి.

do you know that these actress acted as wives to heroes

జయసుధ : చిరంజీవితో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కొంతకాలం తర్వాత జయసుధ రిక్షావోడు సినిమా లో చిరంజీవికి తల్లి పాత్ర చేసింది. భానుప్రియ : జయం మనదేరా సినిమాలో వెంకటేష్ కు తల్లిగా నటించింది. అలాగే అదే సినిమాలో సీనియర్ వెంకటేష్ కు భార్యగా నటించింది. అనుష్క శెట్టి : ప్రస్తుతం హీరోయిన్ల లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు బాహుబలి సినిమాలో సీనియర్ ప్రభాస్ కి భార్య గా నటించి, జూనియర్ ప్రభాస్ కి తల్లిగా కూడా నటించింది.

Admin