Actress : ఇండస్ట్రీలో చాలా మంది తమ నటన పరంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శివశంకర వరప్రసాద్ ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంతో సక్సెస్‌ను సాధించి టాప్ హీరోల్లో ఒకరు అయ్యారు అని ఇలా చెప్తే ఎవరికైనా తెలుస్తుందా. అదే మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది. ఇండస్ట్రీలో అసలు పేరుతో కాకుండా స్క్రీన్ నేమ్స్ తో పాపులర్ అయిన హీరో హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. కొందరు అదృష్టం కలసి వస్తుందని న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటే, మరికొందరు హీరో హీరోయిన్స్ పేర్లను దర్శకులు రొటీన్ గా ఉంటే అయితే ప్రేక్షకులు ఆదరించరు అనే ఉద్దేశంతో వాళ్లను తెరకు మరొక పేరు పెట్టి పరిచయం చేయడం జరుగుతుంది. మన హీరోలే కాకుండా హీరోయిన్స్ లో కూడా చాలామంది పేరు మార్చడం జరిగింది. అలా పేరు మార్చుకున్న మన టాప్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ ఎవరో మీరు కూడా ఒకసారి చూసేయండి.
జయసుధ సహజనటి అనే గుర్తింపుతో అందరికీ బాగా పరిచయమే. జయసుధ అసలు పేరు సుజాత. సుజాత అనేది కామన్ గా ఉంటుందనే ఉద్దేశంతో దర్శక రత్న దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకు పరిచయమైన తర్వాత సుజాత అనే పేరును జయసుధగా మార్చారు. అప్పటి బ్యూటీక్వీన్ జయప్రద అసలు పేరు ఇండస్ట్రీకి రాకముందు లలితా రాణి. ఇక 1990 దశాబ్దంలో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ రోజా. రోజా ఇండస్ట్రీకి రాకముందు అసలు పేరు శ్రీలతా రెడ్డి. చూడముచ్చటైన రూపం గల సౌందర్య గారు అసలు పేరు సౌమ్య.
విజయవాడ అమ్మాయి రంభ అసలు పేరు విజయలక్ష్మి. జేజమ్మ అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. అనుష్క నాగార్జున సరసన సూపర్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ టైంలో నాగార్జున స్వీటీ అని తెరపై చూపిస్తే నిక్ నేమ్ లా ఉంటుందని భావించి అనుష్కగా నాగార్జున పేరు పెట్టారట. ఇలా పలువురు హీరోయిన్లు అసలు పేర్లకన్నా పెట్టిన పేర్లతోనే ఎంతో రాణించారు.