సినీ తారల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీతారలను చూసేందుకు… జనాలు ఎగబడుతుంటారు. ఫోటోల కోసం పిచ్చెక్కి పోతుంటారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం వాటన్నిటినీ ఇష్టపడ్డారు. మామూలు జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే చాలా మంది సినీ స్టార్స్ రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పటికే సోనాలి బింద్రే లాంటి చాలా మంది తారలు అనారోగ్యం బారిన పడ్డారు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎలాంటి అనారోగ్యం బారినపడిన ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యూటిఫుల్ హీరోయిన్ షీలా కౌర్… గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబో లో వచ్చిన ‘పరుగు’ చిత్రంతో తన పాపులారిటీని ఇంకా పెంచుకున్న ఈ భామ… ‘ సీతాకోకచిలుక, మస్కా, అదుర్స్’ సినిమాల్లో నటించింది. అయితే, ఈ సుందరి ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకు ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యింది.
2. మరో స్టార్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా భయంకరమైన వ్యాధి బారిన పడింది. ఈమె 25 ఏళ్లకే బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. ఈ వ్యాధి బారిన పడిన సమయంలో ఈమెను తన భర్త కూడా వదిలేశాడు. కాగా, మనోధైర్యంతో ఈమె వ్యాధిని జయించింది.
3. మనీషా కొయిరాలా కూడా కెరీర్ పిక్స్ టైం లో ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడింది. అలా ఈమె సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం ఈమె బాగానే ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉంటుంది.
4. ముద్దుగుమ్మ సోనాలి బింద్రే… మహేష్ బాబు ‘ మురారి’ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈమె ఆ తర్వాత కాలంలో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది. ఈ వ్యాధి బారిన పడిన సమయంలో గుర్తు పట్టకుండా అయిన సోనాలి బింద్రే… వ్యాధి పైన తీవ్రమైన పోరాటం చేసి చివరకు నెగ్గింది.
5. సీనియర్ హీరోయిన్ గౌతమి కూడా క్యాన్సర్ బారిన పడింది. గౌతమి తల్లి క్యాన్సర్ బారిన పడి కన్నుమూసింది. అయితే, ఈమె మాత్రం క్యాన్సర్ తో పోరాడే… ఆ పోరాటంలో విజయం సాధించింది. ఇకపోతే క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం పౌండేషన్ స్టార్ట్ చేసిన గౌతమి… వారిలో ధైర్యం నింపేందుకే గానూ తన వంతు ప్రయత్నం చేస్తోంది.