వినోదం

Jagapathi Babu : జ‌గ‌ప‌తి బాబు గురించి ఈ విష‌యాలు మీకు తెలిస్తే షాక‌వుతారు..!

Jagapathi Babu : ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆయ‌న సినిమాల‌కి ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా ఉండేవారు. మంచి సినిమాలు చేసి కోట్లు సంపాదించిన జ‌గ‌ప‌తి బాబు జూదంలో చాలా డ‌బ్బులు పోగొట్టుకున్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న‌ జగపతిబాబు కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఆయన చేతిలో చిల్లిగవ్వ లేదు చేయడానికి సినిమాలు లేవు. దానికి తోడు అప్పులు. ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కావడానికి వ్యసనాలే అన్న ప్రచారం జరిగింది. పెద్ద పెద్ద కాసినోలకు పోయి జూదం ఆడేవాడట. హార్స్ రైడింగ్ బెట్టింగ్ కట్టేవాడట. ఈ వ్యసనాలు త‌న‌ను దెబ్బతీశాయట‌.

అమెరికాలో కూడా జూదం ఆడ‌డం వ‌ల‌న కోట్ల రూపాయ‌లు కోల్పోయాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తి బాబు జూదం వలన నేను ఆస్తులు పోగొట్టుకోలేదని చెప్పాడు. ఇప్పటివరకు నేను దాదాపు రూ. 1000 కోట్లు సంపాదించి ఉంటాను. ఆ డబ్బంతా ఎలా పోయిందంటే నా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు అని అన్నారు.. జూదంలో నేను సంపద పోగొట్టుకోలేదు. గ్యాంబ్లింగ్ నేను సరదా కోసమే ఆడతాను. నాకు డబ్బులు ఎలా దాచాలనే విషయంలో జీరో నాలెడ్జ్. సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాను.

do you know these facts about jagapathi babu

డ‌బ్బులు పోగొట్టుకున్న విష‌యంలో ఒకరి బ్లేమ్ చేయను కూడా. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా అజాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పకుండా ఉందని’ తెలిపారు. ఒక్క రూపాయి కూడా లేని స్థితిలో అన్నిపోనూ రూ.30 కోట్ల ఉంటే చాలని తాను భావించార‌ట‌. జగపతి బాబు పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారనే ప్రచారం కూడా ఉంది. ప్రియమణి విషయంలో ఆయన పేరు మారుమ్రోగింది. ఈ వీక్నెస్ తో కూడా జగపతిబాబు కోట్లు కోల్పోయాడని బాగా ప్ర‌చారం జ‌రిగింది. జగపతిబాబు తండ్రి విబి రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత కాగా, ఆయ‌న కూడా ప‌లు సినిమాలు తీసి చేతులు కాల్చుకొని న‌ష్ట‌పోయాడు.

Admin

Recent Posts