వినోదం

Krishna : ఎన్టీఆర్ ముందు కృష్ణ స్పీచ్.. ఏమ‌ని అన్నారంటే..!

Krishna : టాలీవుడ్‌కి రెండు క‌ళ్లుగా ఎన్టీఆర్, కృష్ణల‌ని చెప్ప‌వ‌చ్చు. తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో వీరికి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. సినిమాల విషయంలో ఎవరి స్టైల్‌ వారిదే. ఈ ముగ్గురు అన్ని రకాల సినిమాల చేసినా.. ఎవ‌రికి వారు ప్రత్యేక ముద్ర వేశారు. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్‌.. జానపద, లవర్‌బాయ్‌ తరహా పాత్రలు అంటే నాగేశ్వరరావు.. ఇక ప్రయోగాలు, యాక్షన్‌ హీరో, జేమ్స్‌బాండ్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కృష్ణ. అయితే వీరిలో అక్కినేని నాగేశ్వరరావు కేవలం సినిమాలకే పరిమితం అయితే.. ఎన్టీఆర్‌, కృష్ణ మాత్రం రాజకీయాల్లోను రాణించారు.

అయితే వీరిద్ద‌రి మ‌ధ్య‌ నటనాపరంగా, రాజకీయపరంగా పలు సందర్భాల్లో అభిప్రాయ భేదాలు తెర మీదకు వచ్చాయి. కానీ అవన్ని తాత్కలికమే. విభేదాలు వచ్చిన ప్రతిసారి వారి మధ్య అనుబంధం మరింత పెరుగ‌తూ వ‌చ్చింది.. కడవరకు.. కృష్ణ-ఎన్టీఆర్‌ల మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగింది… ఇంత‌క ముందు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ చెన్నైలో ఉంటే అది హైద‌రాబాద్‌కి రావ‌డం వెన‌క కృష్ణ‌, ఎన్టీఆర్, అక్కినేని ఉన్నారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న త‌ర్వాత కృష్ణ ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్ ముందు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని హైద‌రాబాద్‌కి పూర్తి స్థాయిలో తీసుకు రావాల‌ని చెప్పారు. చాలా త‌క్కువ‌గా మాట్లాడిన కూడా ఆయ‌న మాట‌లు మాత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాయి.

krishna speech before ntr what he said

తాను నటించాలనుకున్న మూవీలో కృష్ణ నటించడంతో ఎన్టీఆర్ మనస్థాపానికి గురయ్యారని.. అప్పటి నుంచి కృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగింది అని అంటుంటారు. అప్పట్లో కృష్ణ సూపర్ ఫామ్ లో ఉన్నారు. యువకుడు కావడంతో క్రేజ్ బాగా పెరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ బడి పండితులు లాంటి సాఫ్ట్ రోల్ చేశారు. దీనితో కృష్ణ పాపులారిటీ బాగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో కూడా వీరి మధ్య అంతకంతకూ దూరం పెరుగుతూనే వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Admin

Recent Posts