వినోదం

Anasuya : అన‌సూయకు చెందిన ఈ ఆస‌క్తిక‌రమైన‌ విష‌యాలు మీకు తెలుసా..?

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ న‌టిగా యాంక‌ర్‌గా అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. అనసూయ 2008లో భద్రుక కాలేజ్ నుండి ఎం.బి.ఎ చేసింది.. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు అనసూయ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. అనసూయ అప్పుడెప్పుడో 19 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది.. వెంటనే జబర్దస్త్ యాంకర్ అయిపోయింది.. ఆ తర్వాత నటిగా మారింది.. ఇప్పుడు స్టార్ అయిపోయింది.

అన్నింటికి మించి అనసూయకు పెళ్లై అప్పుడే 14 యేళ్లు అవుతోంది. అనసూయ భర్త ఏం చేస్తాడు అనేది చాలా వరకు ఎవరికీ తెలియకపోవచ్చు.ఆమె కాలేజ్ డేస్ లో ఎన్ సీ సీలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం చేసుకొని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరువురి కుటుంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది అనసూయ. ఇక వారికి శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు.

do you know these interesting facts about anasuya

ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే తాను నటిస్తోన్న కారణంగా ఇపుడు జబర్ధస్త్‌‌కు గుడ్ బై చెప్పేసింది. గతేడాది పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన అనసూయ.. చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో క‌నిపించి మెప్పించింది. అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి.

Admin

Recent Posts