వినోదం

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోల్లో ముందుగా చెప్పుకునేది బాలకృష్ణ, ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు వినబడుతుంది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ కూడా స్టార్డమ్ తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపులే ఉన్నాయి.. కానీ ఈ మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.. అవేంటంటే అతనొక్కడే, పటాస్, బింబిసార‌.. కానీ ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకే విధంగా ఉంటుంది..

దీని వల్లే ఈ సినిమాలు హిట్ అయ్యాయని చాలా మంది అభిమానులు అంటున్నారు.. మరి అవేంటో ఒకసారి చూద్దాం.. అతనొక్కడే మూవీలో కళ్యాణ్ రామ్ కొంతమందిని చంపుతూ విలన్ లలో భయం పుట్టేలా చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ చూస్తే కళ్యాణ్ రామ్ ఆ విధంగా చేయడానికి కారణం వెలుగులోకి వస్తుంది. అతనొక్కడే మూవీలో కళ్యాణ్ రామ్ కొన్ని సన్నివేశాలలో వైలెంట్ గా కనిపిస్తూ ఉంటారు. ఇక పటాస్ మూవీ విషయానికి వస్తే ఇందులో హీరో కళ్యాణ్ రామ్ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో పరిచయమయ్యారు.

do you know this common point in kalyan ram movies

ఆ తర్వాత మార్పు వచ్చి పోలీస్ ఆఫీసర్ గా మెప్పించారు. బింబిసార‌ మూవీ విషయానికి వస్తే ఇందులో కళ్యాన్ రామ్ క్రూర మైన రాజు పాత్రలో ప్రేక్షకులను అలరిస్తారు.. అహంభావంతో ప్రవర్తించే రాజు తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల మారడం కొసమెరుపు.. ఇలా ఈ మూడు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి హిట్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఈ పాయింట్ ను బట్టి చూస్తే కళ్యాణ్ రామ్ కు ఇవి చాలా కలిసి వస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Admin

Recent Posts