వినోదం

Balakrishna : బాలయ్య బాబుకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఏదో తెలుసా..?

Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ల‌ వంటి వారు. ఇద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1990వ‌ దశాబ్దంలో వీరి సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. ప్రేక్షకులు కూడా బాలయ్య మాస్ యాక్షన్ ని, చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ ని ఎంతో ఇష్టపడేవారు. ఎన్నో రకాల కొత్త కథాంశాలతో పోటాపోటీగా చిత్రాల్లో నటించేవారు. అభిమానుల్లో బాలయ్యకు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మనసుల‌ను దోచుకున్నారు.

చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ల‌ను ఇండస్ట్రీకి అందించారు. ఖైదీ, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్‌ వంటి సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇక బాలయ్య కూడా మంగమ్మ మనవడు, లారీ డ్రైవర్, సింహా, అఖండ వంటి ఘన విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందించారు. అయితే ఒక హీరో నటించిన చిత్రం మరో హీరో నచ్చింది అని చెప్పడం మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం.

do you know which chiranjeevi movie balakrishna likes

కానీ బాలయ్య అలాంటివారు కాదు. మాట కరుకు మనసు వెన్న లాంటి స్వభావం కలవారు. ఏదైనా నచ్చని విషయం ఉంటే ముక్కుసూటిగా నచ్చలేదు అనే స్వభావం కలవారు బాలయ్య. బాలయ్య బాబుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక చిత్రం అంటే చాలా ఇష్టమట. ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరో చిత్రం నచ్చింది అంటే అది చాలా గొప్ప విషయం. బాలయ్యకు అంతగా ఇష్టమైన ఆ చిత్రం ఏమిటంటే.. దర్శకరత్న రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అప్పట్లో ఈ చిత్రం నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని బాల‌య్య ప‌లు సంద‌ర్భాల్లో ఇప్ప‌టికీ చెబుతుంటారు.

Admin

Recent Posts