హెల్త్ టిప్స్

Fasting : ఉప‌వాసం అస‌లు ఎందుకు చేయాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

Fasting : ఇష్టం దైవం పేరిట వారంలో నిర్దిష్టమైన రోజునో, శివరాత్రి వంటి పర్వదినాల్లోనో, ఇతర వ్రతాలు, పూజలు చేసినప్పుడో హిందువుల్లో అధిక శాతం మంది దేవుడికి ఉపవాసం ఉంటారు. ఇది చాలా సహజం. ఆ మాటకొస్తే ముస్లిం సోదరులు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా..? అంటే, మంచిదే.. అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.

why we have to do fasting what happens with it

ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts