వినోదం

సాయిప‌ల్ల‌వికి ఇష్ట‌మైన హీరో ఎవ‌రో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరైనా హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే క్యారెక్టర్ ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ స్టైల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆమె ఏ పాత్రలో చేసిన నటించడమే కాదు అందులో జీవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తండేల్‌ మూవీలో నటించింది. ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంది సాయిపల్లవి, ఈ సందర్భంలోనే తన అభిమాన హీరో ఎవరో ఆమె తెలియజేసింది. ఆయన్ని ఎందుకు అభిమానిస్తుందో కూడా చెప్పింది. మరి ఆయన ఎవరో ఒకసారి చూద్దాం.

do you know who is sai pallavi favorite actor

తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమని, ఆయన అంటే ఎంతో ఇష్టమని తెలియజేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్ అయినా కానీ చాలా సింపుల్ గా వినయంగా ఉంటారని అన్నది. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టమని అందుకే ఆయనకు వీరాభిమానిగా మారానని సాయి పల్లవి తెలియజేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవచ్చని సాయి పల్లవి అన్నది. అలాగే తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం అని వారి అభిమానమే నన్ను ఇంతటి స్టార్ ని చేసిందని తెలియజేసింది.

Admin

Recent Posts