మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. అదే విధంగా దేవున్ని కోరికలు కూడా కోరుకుంటాం. మరి అలా కోరుకున్న కోరికలు మనం బయటకు చెప్పవచ్చా లేదా అనేది ఓ సారి చూద్దాం. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎక్కువగా దేవుడు, దేవాలయాలను మనం నమ్ముతాం. మనకు ఏదైనా బాధ కలిగినా దేవుడికి మొక్కుతాం. ఆ బాధ నుంచి బయట పడేయాలని ఆరాధిస్తాం. కొంతమంది ఉద్యోగం రావాలని, డబ్బు సంపాదించాలని , ఇలా నచ్చిన కోరికలు వారు దేవున్ని కోరుకుంటారు. మరి అలా వాళ్ళు మనసులో కోరుకున్న కోరికలు బయటకు చెబితే ఏం జరుగుతుందో ఓసారి చూడండి..
మనం దేవునికి పూజ చేసి కోరేటటువంటి కోరిక చాలా బలమైనది, కష్టమైనది. అది మనతో కానిది అయితేనే మనం భగవంతున్ని కోరతాం. మరి అలాంటి కోరిక తీరింది అంటే చాలా ఆనంద పడతాం. అయితే మనం బలంగా కోరుకున్న కోరికను ఇతరులకు చెబితే వాళ్లు బయటకి నవ్వుతూ కనిపించినా లోలోపల మాత్రం మన కోరిక నెరవేర కూడదని వారు కూడా కోరుకుంటారట. మనం కోరుకున్న కోరిక అసలు తీరకుండా మానవ ప్రయత్నం ఏదైనా చేయవచ్చు.
అందుకే కోరిన కోరికలు బయటకు చెప్పవద్దు అని పెద్దలు చెబుతున్నారు దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. అలాగే గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఎదురుగా నిల్చొని కోరికలు కోరుకోకూడదు. దేవునికి అటువైపు గాని ఇటువైపుగానీ నిల్చొని మొక్కుకోవాలి. అలాగే దేవుని ముందు కాకుండా ధ్వజస్తంభ ముందు పూజ చేసి మన మనసులోని కోరికలు కోరుకుంటే తొందరగా నెరవేరుతాయి.