వినోదం

Venkatesh : చంటి సినిమాకు వెంక‌టేష్ కాకుండా మొద‌ట ఏ హీరోని అనుకున్నారో తెలుసా?

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లో మంచి హిట్ కొట్టిన చిత్రం చంటి. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తమిళంలో ఘన విజయం సాధించిన చిన తంబిని చూశారు. ఆ చిత్రం రాజేంద్ర ప్రసాద్‌‌తో చేయాలనుకున్నారు. అదే సమయంలో రామానాయుడు, సురేష్, వెంకటేష్‌లు కూడా చినతంబిని చూసి వెంకటేష్‌తో తీయమని రవిరాజాను అడిగారు. కానీ అప్పటికే రాజేంద్రప్రసాద్‌కు మాట ఇచ్చి ఉండడం వల్ల‌ వెంకటేష్‌తో చేయలేనని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామనుకున్నారు రవిరాజా.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఛేంజ్ చేసిన చిత్రాల్లో చంటి ఒకటి. అప్పటికే బొబ్బిలి రాజా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్.. వెంటనే చంటితో రికార్డులు తిరగరాశారు. చంటి చిత్రం సంచలన విజయం సాధించి వెంకటేష్‌కు తిరుగులేని ఫ్యామిలీ ఇమేజ్ ను తీసుకొచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు సాధించింది. చంటి సినిమాలో వెంకటేష్.. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇప్పటికీ చంటి అంటే వెంటనే వెంకీ ఫేస్ గుర్తుకొస్తుంది. అయితే ఈ చిత్రం వెనక అసలు నిజాలు చాలానే ఉన్నాయి.

do you know who is the first choice for venkatesh chanti movie

ముందు ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నపుడు దర్శకుడు, నిర్మాత బుర్రలో అస్సలు వెంకటేష్ లేడు. చిరంజీవి మీడియేటర్‌గా వ్యవహరించి వెంకటేష్‌తో చంటి సినిమా చేయడానికి రవిరాజాను ఒప్పించారు. హీరోయిన్ పాత్రకు తమిళంలో చిన్నతంబిలో చేసిన ఖుష్బూనే తీసుకుందామనుకున్నారు. కానీ ఆమె మళ్లీ అదే పాత్రను తెలుగులో చేయనని చెప్పింది. దాంతో దర్శక నిర్మాతలు మీనాను సంప్రదించారు. ఆమె ఓకే చేయడంతో సినిమా పట్టాలెక్కింది.

1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్ నటన అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా మోగించింది. ఇళయ‌రాజా సంగీతం ఈ సినిమాకు మరో కలిసొచ్చిన అంశం. ఎన్నెన్నో అందాలు, పావురానికి పంజరానికి పెళ్లి చేసెసే పాడు లోకం, అన్నుల మిన్నుల.. ఇలా అన్ని పాటలూ సంగీత ప్రియులను అలరించాయి. ఈ చిత్రం కన్నడ, హిందీలోనూ విడుదలై విజయఢంకా మోగించింది. అయితే హిందీలో అనారిగా వచ్చిన చంటి చిత్రంలోనూ హీరోగా వెంకటేష్‌నే ఎంపిక చేయడం గమనార్హం.

Admin

Recent Posts