వినోదం

Gopi Chand : ఒకే క‌థ‌తో ఎన్‌టీఆర్‌, గోపీచంద్ సినిమాల‌ను తీశారు.. వాటి ఫ‌లితాలు ఎలా వ‌చ్చాయో తెలుసా..?

Gopi Chand : సాధార‌ణంగా మ‌న‌కు కొన్ని సినిమాల క‌థ‌లు ఒకేలా అనిపిస్తాయి. కానీ అవి సాగే విధానం వేరేగా ఉంటుంది. కాక‌పోతే సినిమాల క‌థ‌ల‌ను చూస్తే మాత్రం ఒకేలా అనిపిస్తాయి. ఈ క్ర‌మంలోనే వాటి కథనాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇక ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన విధంగా దేవదాసు, అర్జున్ రెడ్డి సినిమాల‌ కథలు ఒకటే. అయిన‌ప్ప‌టికీ వాటి కథనాలు వేరేగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ రెండు సినిమాలు కూడా చరిత్రను సృష్టించాయి. ఇవి రెండూ హిట్ సినిమాలే. అయితే కొన్ని సినిమాల కథలు ఒకేలాగా ఉంటాయి. అయినా కూడా వాటి కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే అవి హిట్ గా నిలుస్తాయి. ఇక ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను బట్టి, కథనాలను బట్టి సినిమాల‌ ఫలితాలు అనేవి వ‌స్తుంటాయి.

అయితే హీరోలు గోపీచంద్, ఎన్టీఆర్ ఒకేలాంటి కథల‌తో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా ఫలితాలలో పెద్ద తేడా అయితే లేదు. బీవీఎస్ ర‌వి దర్శకత్వంలో గోపీచంద్ 2011 లో వాంటెడ్ అనే సినిమాలో న‌టించారు. కాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ‌ను పొందాలంటే మాత్రం హీరోయిన్ చెప్పిన ప‌ని చేయాల్సి ఉంటుంది. విల‌న్‌ను చంపాల‌ని హీరోకు హీరోయిన్ కండిష‌న్ పెడుతుంది. ఇలా ఈ సినిమా సాగుతుంది. ఇక హీరోయిన్ కు చెందిన కుటుంబం మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో చ‌నిపోతారు. వారిలో ఒక పోలీస్ ఆఫీస‌ర్ ఉంటారు.

gopichand and ntr did same movies

కాగా ఎన్‌టీఆర్‌తో వాంటెడ్ మూవీ స్టోరీనే సురేందర్ రెడ్డి ఊసరవెల్లి సినిమాగా తెరకెక్కించారు. ఇందులోనూ హీరోయిన్ కోసం హీరో ప‌గ తీర్చుకుంటాడు. కానీ హీరోయిన్ గ‌తం మ‌రిచిపోతుంది. ఆ విష‌యం మ‌రిచిపోతుంద‌నే ఆమె హీరోకు త‌న ప‌గ గురించి చెబుతుంది. దీంతో హీరో దాన్ని గుర్తు పెట్టుకుని మ‌రీ ఆమె కోసం ప‌గ తీర్చుకుంటాడు. ఇలా వాంటెడ్‌, ఊస‌ర‌వెల్లి.. రెండు సినిమాల్లోనూ ఒకే పాయింట్ మ‌న‌కు క‌నిపిస్తుంది. కానీ ఇవి రెండూ సాగిన విధానం వేరేగా ఉంటుంది. అయితే ఈ రెండు చిత్రాలలోనూ వాంటెడ్ చిత్రం ఫ్లాప్ కాగా.. ఊసరవెల్లి చిత్రం మాత్రం బిలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాలలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ ఆఫీసర్ గా ఉంటారు. ఇలా ఈ రెండు సినిమాల‌కు చెందిన క‌థ‌ల్లోనూ అనేక పోలిక‌ల‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts