వినోదం

Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు..!

Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర 2. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మొద‌టి పార్ట్ ఇచ్చిన జోష్‌తో 2వ పార్ట్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

have you seen Jr NTR Rare Photos

ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. సినిమా 2వ పార్ట్‌ హక్కులను సొంతం చేసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ ప్రొడ్యూసర్లు కూడా రంగంలోకి దిగారని, వారినుంచి నిర్మాతలకు భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ లెక్కలను చూసి టాలీవుడ్ షేకవుతోందంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ అందించారు.

ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983 లో మే 20న హైదరాబాద్ లో జన్మించిన ఎన్టీఆర్ చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇది చూసిన వారంద‌రు అవాక్క‌వుతున్నారు.

గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తిచేసిన ఎన్టీఆర్, ఇంటర్ హైదరాబాద్ లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. చదువుతో పాటుగా నటన మరియు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు.

తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు,‘బాల రామాయణం’ సినిమాలో రాముడుగా నటించాడు. ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆ తరువాత 2001 లో ‘నిన్నుచూడాలని’ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాదిలో రిలీజ్ అయిన ‘ స్టూడెంట్ నెం .1’ మూవీ విజయం సాధించడంతో ఇక ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

Admin

Recent Posts