వినోదం

Yamagola : య‌మ‌లోకం సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్.. యమ‌గోల వెన‌క అంత జ‌రిగిందా?

Yamagola : తెలుగు సినిమా చరిత్రలో యముడిని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలగోపాలాన్ని అలరించిన సినిమాల్లో య‌మ‌గోల‌ చిత్రానికి మొద‌టి స్థానం ద‌క్కుతుంది. 1960లో సి పుల్లయ్య ‘దేవాంతకుడు’ సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది. కానీ షూట్ కు వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి.

1977 అక్టోబర్ 21న విడులైన యమగోల చరిత్ర సృష్టించింది. లవకుశ, దానవీరశూరకర్ణ, అడవిరాముడు తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. 28 సెంటర్లలో 100 రోజులు, 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇక అన్నింటికీ మించి చక్రవర్తి సంగీత సారథ్యంలో వచ్చిన ఓలమ్మి తిక్కరేగిందా, చిలకకొట్టుడు కొడితే, గుడివాడ యెల్లాను పాటలకు థియేటర్లలో జనం ఊగిపోయేవారు. అన్నగారి అభిమానులైతే స్క్రీన్ మీదకు డబ్బులు విసిరేవారట. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ చేయాల్సి వుండగా.. యముడిగా ఎన్టీఆర్ నటించాల్సింది.

yamagola movie interesting facts to know

నిజానికి ‘య‌మ‌గోల’ అనే టైటిల్ అల‌నాటి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు పుల్ల‌య్య‌ది. పురాణాల మీద సెటైరిక‌ల్ పిక్చ‌ర్ తీయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న య‌మ‌గోల టైటిల్‌ను ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు. ర‌చ‌యిత ఆదుర్తి న‌ర‌సింహ‌మూర్తి (ఆదుర్తి సుబ్బారావు త‌మ్ముడు)తో కొంత క‌థ త‌యారుచేయించారు. ఏ కార‌ణం చేత‌నో ఆ క‌థ పూర్తి కాలేదు. కొన్నాళ్ల‌కు పుల్ల‌య్య క‌న్నుమూశారు. త‌ర్వాత ఆయ‌న కుమారుడు, ద‌ర్శ‌కుడు సి.య‌స్‌. రావు.. ఆ క‌థ‌ను సొంతంగా త‌న అభిప్రాయాల‌తో ఆయ‌న రాసుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవాంతకుడు’లో ఆయన యముడిగా నటించి వున్నారు. మళ్లీ ఎన్టీఆర్ యముడిగా నటిస్తే జనం రియాక్షన్ ఎలా వుంటుందోనన్న భయంతో బాలయ్యను హీరోగా అనుకున్నారు. అయితే ఇది అన్నగారికి నచ్చలేదు. బాలయ్య సొంత బ్యానర్ లో తప్పించి వేరే బ్యానర్ లలో సినిమాలు చేయడం రామారావుకు నచ్చదు. దీంతో బాలకృష్ణను తప్పించి.. తానే హీరోగా నటించాలని అనుకున్నారు. అంతేకాకుండా తాను చేయాల్సిన యముడి పాత్రకు కైకాల సత్యనారాయణను రికమెండ్ చేశారు. అలా డివైన్ కామెడీతో వచ్చిన యమగోల బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Admin

Recent Posts