వినోదం

Attarintiki Daredi Making : అత్తారింటికి దారేది రైల్వే స్టేషన్ క్లైమాక్స్ తీసిన ప్లేస్ ఇదే..!

Attarintiki Daredi Making : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్ లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మళ్లీ పవర్ స్టార్ బాక్సాఫీస్ పంజను చూపించాడు. 2013 అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదాకు తగ్గట్టుగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ బ‌య‌ట‌కు రావ‌డంతో సినిమా వెండితెరపై అంతగా సక్సెస్ కాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా అప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న రెండవ సినిమాగా కూడా అత్తారింటికి దారేది వండర్స్ క్రియేట్ చేసింది. అత్త కోసం వెళ్లే మేనల్లుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఒకవైపు తన హీరోయిజాన్ని మరోవైపు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ మ్యాన్ గా చక్కని నటనను కనబరిచాడు. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోను ఆ స్థాయిలో నటించలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

Attarintiki Daredi Making this is the raily station

ఈ సినిమాలో రైల్వే స్టేష‌న్ సీన్ హైలైట్. అత్త‌పై త‌మ‌కి ఎంత ప్రేమ ఉందో చెబుతూ ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ అయిన సీన్స్ చాలా ఆక‌ట్టుకున్నాయి.అసలు ఆ సినిమా ఆడటానికి కారణమే క్లయిమాక్స్ అని చెప్పుకుంటారు. అయితే ఈ రైల్వే స్టేష‌న్ సీన్ ఎక్క‌డ తీసి ఉంటారా అని ప్ర‌తి ఒక్క‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది రామోజీఫిలిం సిటీలో సెట్ వేసి తీసారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Admin

Recent Posts