వినోదం

యంగ్ టైగర్ సంతకం ఎప్పుడైనా చూశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ కోసం తన ఇంటికి వచ్చిన అభిమానులను తరచూ ఎన్టీఆర్ కలుసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇంటికి వెళ్లి తన కొడుకు పెళ్ళికి రమ్మని ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమాని తన అభిమాన హీరో నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

ఎన్టీఆర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్న సదరు అభిమాని ఎన్టీఆర్ సంతకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటివరకు తారక్ సంతకం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు చూడండి అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం తారక్ సంతకం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.

have you seen jr ntr sign

ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం కొర‌టాల శివ దర్శకత్వంలో దేవ‌ర 2 సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కనుంది.

Admin

Recent Posts