వినోదం

Ramya Krishna Son : వామ్మో.. ర‌మ్య‌కృష్ణ కొడుకు చాలా పెద్ద‌య్యాడే.. ఇప్పుడెలా ఉన్నాడంటే..!

Ramya Krishna Son : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా స‌త్తా చాటిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌తో సత్తా చాటుతుంది. బాహుబ‌లి సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమాతో ర‌మ్య‌కృష్ణ‌కి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కింది. ర‌మ్య‌కృష్ణ న‌టిగానే కాకుండా హోస్ట్‌గా కూడా అద‌ర‌గొడుతుంది . వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. అయితే గ‌తంలో ర‌మ్య‌కృష్ణ త‌న త‌న‌యుడితో తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్షం అయింది.కలియుగ దైవం ఏడుకొండల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి రమ్యకృష్ణ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణ, రిత్విక్‌లకు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కొంత మంది ఆసక్తి కనబరిచారు. కొడుకు చేయి పట్టుకుని రమ్యకృష్ణ ముందుకు సాగారు.ర‌మ్య‌కృష్ణ కొడుకుని చూసి ప్ర‌తి ఒక్కరు షాక్ అయ్యారు. చాలా రోజుల త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ కొడుకుని చూసి అభిమానులు కూడా మురిసిపోయారు. చూస్తుంటే ర‌మ్య‌క‌ష్ణ త‌న కుమారుడిని హీరోగా చేయ‌నుందంటూ ప్ర‌చారాలు మొద‌లుపెట్టారు.

have you seen ramya krishna son rithvik

ఇదిలా ఉంటే కృష్ణ‌వంశీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మా అబ్బాయి రిత్విక్ వంశీ టీనేజ్‌లో ఉన్నాడు. అతని అభిరుచులు వారానికి ఒకసారి మారుతుంటాయి. ఒకసారి క్రికెట్ అంటాడు, ఇంకోసారి ఫుట్‌బాల్ అంటాడు… ఇంకోసారి ఇంకేదో అంటాడు. నా భార్య రమ్య వాడిని హ్యాండిల్ చేస్తుంది. వాడి చదువు విషయాలు చూసుకుంటుంది. చెల్లి కూడా రిత్విక్‌ని చూసుకుంటుంది అని చెప్పాడు కృష్ణ‌వంశీ. మొత్తానికి కృష్ణ‌వంశీ త‌న‌యుడి పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Admin

Recent Posts