వినోదం

కేజీఎఫ్ మూవీలో హీరో త‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఈమె.. బ‌య‌ట ఎలా ఉంటుందో చూశారా..?

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ ప్రేక్ష‌కులు త‌లెత్తుకునేలా చేసిన చిత్రం కేజీఎఫ్‌. ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క పాత్ర‌కి మంచి గుర్తింపు ద‌క్కింది. ముఖ్యంగా రాకీ త‌ల్లి పాత్ర పోషించిన న‌టి పేరు మారు మ్రోగింది. అందుకు కార‌ణం ఆమె సినిమాలో చాలా డీ గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌గా, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా అందంగా క‌నిపిస్తుంది. యశ్ చిన్నతనంలో అమ్మగా చేసిన నటి పేరు అర్చన జోస్.. కర్ణాటకలోని బెంగళూరులో 1994లో జన్మించారు.ఆమె బెంగుళూరులోని న్యూ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేయ‌గా, నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథాకళిలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

తమిళనాడులోని తంజావూరులో ఉన్న‌ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేశారు. తొలిసారి ఈ న‌టి క‌న్నడ సీరియల్ మహాదేవితో నటించారు. ఆ సీరియల్‌లో సుందరి క్యారెక్టర్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె 2019లో యష్ నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 చిత్రంలో న‌టించి త‌న సినీ జీవితాన్ని ప్రారంభించింది. 27 సంవత్సరాల అర్చన ఇందులో రాకీ తల్లి చందమ్మగా నటించడం విశేషం. చిన్న వయసులోనే ప్రముఖ హీరో క్యారెక్టర్‌కి తల్లిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అర్చ‌న‌.

have you seen rocky bhai mother in kgf in real life

ఈ సినిమా త‌ర్వాత అర్చ‌న‌కి మంచి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ చిత్రంలో యశ్‌ మాస్‌ యాక్షన్‌కు తోడు ప్రశాంత్‌ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఈ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం రూపొందగా, ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి అనేక రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

Admin

Recent Posts