RRR Movie VFX : బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ గా ఇండియన్ ప్రేక్షకులు అద్భుతం అంటూ కితాబిచ్చినఈ విజువల్ ట్రీక్ కి చాలా మంది ఫిదా అయ్యారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇటీవలి కాలంలో రాజమౌళి తన సినిమాలకి మంచి వీఎఫ్ఎక్స్ వాడుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆస్కార్ నామినేషన్స్ ను ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క వీఎఫ్ఎక్స్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ నిరాశ పరిచింది.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్స్ ఎలా జరిగిందో ఇప్పటికే మేకర్స్ పలు వీడియోల ద్వారా తెలియజేశారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ఆర్ఆర్ఆర్ సినిమాలోని పోరాట సన్నివేశాలకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ చేసింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకి హాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఎన్టీఆర్ పులితో ఫైట్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఓ బాలుడిని కాపాడే సన్నివేశం, అడవిలో ఫైటింగ్, కోటలోకి ఎన్టీఆర్ జంతువులతో కలిసి ఎంట్రీ ఇవ్వడం, అలానే పులిని బ్రిటీష్ వాళ్లపైకి విసిరివేయడం ఇవన్నీ కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తాయి.
కాని వీటికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ చేసినట్టు ఈ వీడియోని చూస్తే అర్ధమవుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం గా వ్యాపించింది…ఇక ఈ సినిమా ఎన్నో ఇంటర్నేషల్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.అంతే కాదు ఏకంగా ఆస్కార్ అందుకొని భారతీయ సినిమా స్థాయిని రెండింతలు పెంచింది… అయితే ఆస్కార్ విజేతగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఈ సినిమా కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మాత్రం నిరాశే ఎదురైంది. అయితే భారత చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మన దర్శకులు తమ టాలెంట్‌ను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు మంచి అవకాశం ఉంది.