ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ, కొన్ని రోజులనుండి సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు అనే అపవాదు వెయ్యటం సాగించారు.
ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ధాబా దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు.
అలా ఆ డైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు సుమంత్ మోలగోంకర్. ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరున టాటా సుమో వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటె మోలగోంకర్. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది.