హెల్త్ టిప్స్

గ్రీన్ టీ బ్యాగ్స్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దాని ప్రయోజనాలు, ప్రభావాలు టీ బ్యాగ్ యొక్క నాణ్యత, సిద్ధం చేసే పద్ధతి మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి. EGCG (ఎపిగాలోకెటెచిన్ గాలేట్) గ్రీన్ టీలో ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కెఫీన్, కేటెచిన్లు గ్రీన్ టీలో ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందువ‌ల్ల రోజూ 2 క‌ప్పుల మోతాదులో గ్రీన్ టీని సేవిస్తుంటే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

L-థియానైన్ అనే అమైనో ఆమ్లం కూడా గ్రీన్ టీలో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళ‌న‌ని తగ్గిస్తుంది. దీంతో మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ్రీన్ టీని సేవిస్తుంటే వాపులు త‌గ్గిపోతాయి. క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. డ‌యాబెటిస్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

is it safe to use green tea bags

గ్రీన్ టీ మ‌న‌కు మార్కెట్‌లో పొడి రూపంలోనూ ల‌భిస్తుంది. దీన్ని వాడ‌డం ఉత్త‌మం. గ్రీన్ టీ బ్యాగుల‌ను నైలాన్ లేదా ప్లాస్టిక్‌తో త‌యారు చేస్తారు. అందువ‌ల్ల గ్రీన్ టీ బ్యాగుల‌ను వేడి నీటిలో వేసిన‌ప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ ఆ నీటిలోకి విడుద‌ల అవుతాయి. అలాంటి టీని సేవిస్తే మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. అలాగే కొన్ని బ్రాండ్ల‌కు చెందిన వారు నాణ్య‌త త‌క్కువ‌గా ఉండే గ్రీన్ టీని వాడుతారు. ఇది క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌దు. క‌నుక మంచి బ్రాండ్‌కు చెందిన గ్రీన్ టీని మాత్ర‌మే కొనాలి. అలాగే కొంద‌రు త‌యారీదారులు గ్రీన్ టీ బ్యాగ్‌లలో కెమిక‌ల్ బ్లీచింగ్ చేస్తారు. కాబ‌ట్టి గ్రీన్ టీ బ్యాగ్స్ క‌న్నా నేరుగా పొడిని కొని వాడ‌డ‌మే మంచిది.

Admin

Recent Posts