వినోదం

Nijam Movie : నిజం అట్ట‌ర్ ఫ్లాప్ అన్నారు.. కానీ ఈ చిత్రం ఎంత వ‌సూళ్లు సాధించిందంటే..?

Nijam Movie : కృష్ణ న‌టవార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. ఫ్లాపులు వ‌చ్చిన కూడా మంచి హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు. ఈయన ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో నటించాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీలో కూడా నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. అయితే టాప్ రేంజ్‌లో ఉన్న మ‌హేష్ భారీ విజాయలను అందుకోగా, ఆయ‌న కెరియ‌ర్ లో కొన్ని ఫ్లాప్ మూవీలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన మూవీలలో నిజం సినిమా ఒకటి అని చెప్పాలి.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నతేజ‌ ఈ మూవీకి దర్శకత్వం వహించగా… రక్షిత ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా నటించింది. గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన ఈ చిత్రం ఫ్లాప్ కావ‌డం జ‌రిగింది. అంత‌క‌ముందు తేజ‌.. చిత్రం… జయం… నువ్వు నేను లాంటి వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు.

nijam movie collections

అయితే నిజం ఫ్లాప్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. ‘నిజం’ చిత్రం తన గత సినిమాలలానే రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిందట. కానీ అందరూ ఈ సినిమా ప్లాప్ అని చెప్పుకుంటారు కానీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకున్న సినిమా అని తేజ స్ప‌ష్టం చేశాడు. ఒక్కడు మూవీ తర్వాత నిజం సినిమా విడుదల కావడం వల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అదే ఒక్కడు మూవీ కంటే ముందు కనుక నిజం సినిమా విడుదల అయి ఉంటే బంపర్ హిట్ అయి ఉండేద‌ని తెలియ‌జేశాడు.

Admin

Recent Posts