శివాజీ రావు గైక్వాడ్ 12 డిసెంబర్ 1950 లో ఒక మహారాష్ట్ర ఫ్యామిలీ కి బెంగళూర్ లో జన్మించాడు. తండ్రి రామోజీ రావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్ , నాలుగు పిల్లల్లో చిన్నవాడు. ఇద్దరు అన్నలు, ఓ అక్క , తన తొమ్మిదో ఏటనే తల్లిని కోల్పోయాడు, స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నో చిన్న ఉద్యోగాలు చేసి చివరికి బస్ట్ కండక్టర్ ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగం చేస్తూనే ఎన్నో కన్నడ నాటకాల్లో వేషాలు వేసేవాడు. తండ్రి సపోర్ట్ చెయ్యకపోయినా మిత్రుడు రాజ్ బహదుర్ సహాయంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో చేరాడు. అక్కడే దిక్కజ డైరెక్టర్ బాలచందర్ తో పరిచయం అయ్యి అతని సలహా మేరకు తమిళ్ నేర్చుకొన్నాడు. తమిళ్ సూపర్ హీరో శివాజీ ఉన్నాడు కాబట్టి ఇతిని పేరును రజనీ కాంత్ గా బాలచందర్ మార్చాడు.
1975 లో బాలచందర్ దర్శకత్వం లో అపూర్వ రాగంగల్ తో మొదలైన రజనీ కాంత్ సినీ జీవితం ఇప్పటికీ దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ , బెంగాలీ , మళయాలం సినిమాల్లో నటించాడు. భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈయనకి చెప్పుకోదగ్గ అభిమానులు ఉన్నారు. రజనీ కాంత్ సినిమాలు అతి ఎక్కువ వసూళ్లు సాధించడంలో అతనికి అతనే సాటి. తన సినిమాల కలెక్షన్లను ఎప్పుడూ తానే అధిగమించేవాడు. భారత్ దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా 500 కోట్లు వసూలు చేసిన బాషా సినిమా హీరో రజనీ కాంత్ .
1978 లో తమిళనాడు స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. 1984 లో కళైమామణి, 2000లో పద్మ భూషణ్, 2016 లో పద్మ విభూషణ్, 2019 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు (1984) తో పాటు అనేక తమిళ్ నాడు స్టేట్ అవార్డులు కూడా సాధించాడు.