వినోదం

Sanusha Santosh : బంగారం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో చూశారా..?

Sanusha Santosh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే.. ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. పవన్ సినీ కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నాయో, అలాగే కొన్ని పరాజయాలు కూడా వున్నాయి. వాటిలో అన్నవరం, బంగారం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన సినిమా బంగారం. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచినా.. కొంతమందికి ఈ సినిమా చాలా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కు చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

వింద్యారెడ్డి పాత్రలో నటించిన ఆ చిన్నారి పేరు సనూషా సంతోష్. కళ్ళద్దాలు పెట్టుకుని, కిలకిలా నవ్వుతూ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ చిన్నారి పాప ఇప్పుడు పెరిగి పెద్దదయింది. కాగా బంగారం సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సనూషా సంతోష్. ఈ సినిమా కంటే ముందే సనూష మలయాళంలో దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా చిన్న వయసులోనే రెండుసార్లు ఉత్తమ బాలనటిగా జాతీయ ఆవార్డులు అందుకుంది. తెలుగులో బంగారం సినిమాతో ఎంట్రీ ఇవ్వగా మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

have you seen Sanusha Santosh how is she now

ఇదిలా ఉంటే 2012 లో సనూష మిస్టర్ మురుగన్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన రేణిగుంట, జీనియస్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. చివరగా నాని హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా జెర్సీలో జర్నలిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్ కు వెళ్లి స్థిరపడింది. ప్రస్తుతం మాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తూ సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటుంది. తన ఫోటోలు, సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.

Admin

Recent Posts