టాలీవుడ్ లో చిరంజీవి సినిమా వస్తుంది అనగానే ఒక రకమైన క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు పనులు మానుకొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. అయితే ఆయన సినిమాల్లో ఎన్నో అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆయన సినిమాలో ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా ప్రత్యేకంగా ఒకటి చెప్పుకోవచ్చు. ఆ సినిమా పేరే అంజి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో గతంలో కోడి రామకృష్ణ చెప్పారు. ముందు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చిరంజీవితో ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చేద్దామని కోడి రామకృష్ణ గారితో అన్నారట. అందుకు కోడి రామకృష్ణ గారు చిరంజీవి కమర్షియల్ స్టార్ కాబట్టి తన దగ్గర ఒక డబుల్ రోల్ హీరో పాత్ర ఉన్న స్టోరీ ఉంది అని, చిరంజీవితో ఆ సినిమా చేద్దామని అన్నారట. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రం గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమానే చేద్దామని అన్నారు. ఈ విషయంపై చిరంజీవిని సంప్రదించి ఈ సినిమా కోసం తను ఒక కొత్త నటుడి లాగా కష్టపడాలి అని అన్నారట కోడి రామకృష్ణ.
అందుకు చిరంజీవి పర్వాలేదు అని, అంతే కష్టపడతాను అని అన్నారట. దాంతో కోడి రామకృష్ణ గారు సోషియో ఫాంటసీ అయినా అంజి కథని సిద్ధం చేశారు. మూవీ షూటింగ్ కి చాలా సమయం పట్టింది. ఆ మూవీ షూటింగ్ టైం లో చిరంజీవి ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశారట. కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే రెండు సంవత్సరాలు పట్టింది. ఆ రెండు సంవత్సరాలు సినిమా షూటింగ్ కోసం చిరంజీవి ఒకటే షర్టు వేసుకున్నారట. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతి వారు ఇంత కష్టపడ్డారు కాబట్టి సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు అవుతున్న కూడా తెలుగు పేక్షకులకు అంజి సినిమా ఇప్పటికి గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది.