హెల్త్ టిప్స్

రోజుకొక ఉసిరికాయ తినండి – ఎలా తిన్నా పరవాలేదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ – పురాణకాలం నుండీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం&period; సంస్కృతంలో &OpenCurlyQuote;ఆమలక ఫలం’ అంటారు&period; సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన &OpenCurlyQuote;త్రిఫల చూర్ణం’లో ఒకటి ఉసిరికాయ&period; మిగిలిన రెండు&comma; కరక్కాయ&comma; తానికాయలు&period; &OpenCurlyQuote;చ్యవన్‌ప్రాశ్‌’లో కూడా ఉసిరి అతిముఖ్యమైన దినుసు&period;అంతేకాదు&comma; తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా విలసిల్లింది&period; బ్రిటిష్‌ వారు దీన్ని &OpenCurlyQuote;ఇండియన్ గూస్‌బెర్రీ’గా పిలిచేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి&period; ముఖ్యంగా ఇది విటమిన్‌-సి కి బ్యాంక్‌ లాంటిది&period; యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి&period; కెలోరీలు కూడా చాలా తక్కువ&period;ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు&comma; పోషకాహార నిపుణులు కూడా రోజూ ఒక ఉసిరికాయ తినమని ఒత్తిడి తెస్తున్నారంటే ఇది ఎంత ఆరోగ్యకరమో ఊహించవచ్చు&period; సింపుల్‌గా చెప్పాలంటే&comma; కడుపులో డాక్టర్‌ను పెట్టుకున్నట్టే&period; చర్మరక్షణ&comma; కేశ సంరక్షణ&comma; రోగనిరోధక వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహిస్తుంది ఈ ఉసిరి&period; రోజొక ఉసిరికాయను తింటే&comma; జలుబు&comma; దగ్గు&comma; ఫ్లూ లాంటివి మీ దరిచేరవని అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు à°¡à°¾&period; రుజితా దివేకర్‌&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;తినండి రోజొక ఉసిరి – ఇంటినిండా ఆరోగ్య సిరి’’ అనేది ఆమె నినాదం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69539 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;amla-2&period;jpg" alt&equals;"take daily one amla for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికి ఉన్న ఔషధ గుణాల వల్ల&comma; ఆరోగ్యంగా&comma; బలంగా ఉండటానికి ముఖ్యంగా శీతాకాలంలో జలుబు&comma; దగ్గు వంటి వాటి బారిన పడకుండా ప్రజలు దీన్ని విరివిగా తినేవారు&period; ఫ్లూజ్వరం వంటివి వస్తే త్వరగా కోలుకోవడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది&period; మీరు బరువు తగ్గాలని కోరుకుంటే&comma; ఉసిరి తోడుంటుంది&period; నడుం దగ్గరి కొవ్వును కరిగించి&comma; సన్నని&comma; నాజూకైన నడుమును మీకు బహుమతిగా ఇస్తుంది&period; వ్యాయామం అంటే మీకు సహజంగా ఉండే బద్ధకాన్ని కూడా నివారిస్తుంది&period; డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది అమృతం లాంటిది&period; ఇన్సులిన్‌ స్పందనను పెంచి&comma; రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఉసిరిని తమ ఆహారంలోకి చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు&period; ఇది కొలెస్టరాల్‌ ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు&comma; హృదయ రక్షణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది&period; ఇకవిటమిన్‌-సి విషయానికొస్తే&comma; ఉసిరికాయ&comma; నారింజపండు కంటే ఇరవై రెట్లు ఎక్కువ సి-విటమిన్‌ను కలిగిఉంటుంది&period; అలసట&comma; నీరసం&comma; చిరాకులను పారద్రోలడానికి సులభమైన మార్గం ఉసిరికాయ&period;<br &sol;>&NewLine;ఉసిరికాయలోని రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు&comma; గాయాలను త్వరగా నయం చేయడంలో బాగా ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-69538" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;amla-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు శరీరంలో ఇనుము లేకపోవడం&comma; రక్తహీనతలతో బాధపడుతుంటే&comma; ఉసిరికాయ కంటే ఉత్తమమైనదేదీ లేదు&period; శరీరంలో ఐరన్‌ను ప్రోది చేయడానికి&comma; హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది&period; ఉసిరిలోని ఈ ఇనుము సమీకరణ గుణం&comma; అమ్మాయిలకు బాగా ఉపయోగపడుతుంది&period; వారికి రుతుక్రమానికి ముందు వచ్చే నొప్పిని అరికడుతుంది&period; క్రమం తప్పకుండా తింటే&comma; రుతుస్రావపు నొప్పినుండి కూడా బయటపడొచ్చు&period; ఇంకా&comma; రెండోరోజు కూడా స్రావం ఎక్కువగా ఉంటే&comma; ఉసిరిలోని విటమిన్‌ బి1&comma; బి2లు మీకు సహాయకారిగా ఉంటాయి&period;<br &sol;>&NewLine;మీకు యవ్వనవంతమైన చర్మం&comma; గ్రే కలర్‌ లేని కేశాలు కావాలంటే&comma; ఉసిరిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి&period; కళ్లు&comma; పళ్ల సంరక్షణలో కూడా ఉసిరికాయ చాలా మేలు చేస్తుంది&period; ఉసిరికాయ బహుముఖ ప్రయోజనాలు కలిగిన పండు&period; దీన్ని తినాలంటే రకరకాల పద్ధతులున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేరుగా తినేయొచ్చు&period; కావాలంటే కొద్దిగా ఉప్పు చల్లుకోండి&period; మెత్తగా దంచి&comma; నీళ్లలో కలుపుకుని షర్బత్‌లాగా తాగేయవచ్చు&period; ఉసిరి మురబ్బా&comma; ఉసిరి జామ్‌ కూడా తయారుచేసుకోవచ్చు&period; ఇలా చేసుకుంటే ఎక్కువకాలం కూడా నిల్వ ఉంటాయి&period; ఉసిరికాయ పచ్చడి&period; దీనికెలాగూ తెలుగువారు అభిమానులే&period; ఇక చెప్పనవసరం లేదు&period; ఉసిరికాయ ముక్కలను ఉప్పులో నానబెట్టి&comma; తర్వాత ఎండబెట్టి దాచుకోవచ్చు&period; అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే మంచి శక్తితో పాటు మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది&period; అన్నట్లు అజీర్తిని వెంటనే అరికడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts