వినోదం

Badri Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ద్రి మూవీ వెనుక అంత క‌థ న‌డిచిందా..?

Badri Movie : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బద్రి సినిమా అఖండమైన విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే కావడం విశేషం. ఏప్రిల్ 20 తేదీ, 2000 సంవత్సరంలో బద్రి సినిమా విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదలైంది. ఈ సినిమాతోనే పవన్ మరియు రేణుదేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వెళ్ళింది.

పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, పూరి జగన్నాథ్ డైలాగులు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా కోసం హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట. పవన్ కంటే ముందుగా మరో స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకోవాలని అనుకున్నారట.

interesting facts behind badri movie story

సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరో కోసం కథ రాసుకుని డేట్స్ కుదరక మరో హీరోను తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాగే బద్రి సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది.. ఈ సినిమా కథను నాగార్జున కోసం రాసుకున్నాడట. అయితే ఆయన డేట్స్ కుదరక పోవడంతో.. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేశారు పూరి జగన్నాథ్. అయితే పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ న్యూ మార్చాలని కోరారట. కానీ దానికి పూరి జగన్నాథ్ ఒప్పుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ బద్రి సినిమా చేశారు.

Admin

Recent Posts