హెల్త్ టిప్స్

ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా? కారణాలివే..

కళ్ల కింద చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకనే కళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు. చాలామందికి కళ్లకింద వాపు ఉంటుంది. కొంచెం ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉంటే అది ప్రమాదం. కంటి చుట్టూ ఉన్న చర్మంవాపు వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా కనబడుతుంది. ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బెత్తుగా ఉంటూ క్యారీ బ్యాగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అవి తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా ఉంది.

క్యారీబ్యాగ్స్ రావడానికి కారణాలు :

కళ్లు ఉబ్బెత్తుగా రావడానికి కారణం ముఖ్యంగా నిద్రలేమి. అధిక ఒత్తిడి, ఎక్కువగా ఏడవడం, డీహైడ్రేషన్, కళ్లు ఉబ్బెత్తుగా ఉండడానికి కారణం ఏదైనా కావచ్చు. ఈ సమస్యకు కచ్ఛితమైన పరిష్కారం.

నివారణ :

శరీరంలో నీటిశాతం తగ్గితే చర్మం పొడిబారడమే కాకుండా కంటికింద ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి నిద్రించేముందు తగినన్ని నీళ్లు తాగాలి. రాత్రి సమయంలో ఎక్కువగా నీరు తీసుకోకూడదు అంటారు. ఒక్కసారిగా కాకుండా అప్పుడప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. రోజంతా కూడా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకోవాలి.

ఆల్కహాల్, జంక్‌ఫుడ్ నివారించాలి :

రాత్రి పడుకునే హాయిగా టీవీ చేస్తుంటారు. టైంపాస్‌కు పాప్‌కార్న్, జంక్‌ఫుడ్ తింటారు. వీటిలో అధిక సోడియం (ఉప్పు) కంటెంట్ వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక ఆల్కహాలఅవ డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. దీంతో కళ్లు ఉబ్బుతాయి.

if your eyes are swelling in the morning do like this

అలర్జీలకు కారణమయ్యేవాటిని తొలిగించండి :

ఇల్లు శుభ్రంగా ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. నిద్రించే బెడ్, బెడ్‌షీట్లు, సోఫాలు నీటిగా ఉండాలి. లేదంటే అలర్జీకి గురవుతారు. దీనివల్ల చీకాకు తత్ఫలితంగా కళ్లకింద ఉబ్బెత్తుగా మారుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవాలి :

ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్‌బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్లు ఉబ్బినట్లుగా ఉంటుంది.

ఫ్రోజోన్ స్పూన్ :

ఉదయం లేవగానే కళ్లు ఉబ్బినట్లు ఉంటే స్టీల్ స్పూన్‌ను ఫ్రీజర్లో ఉంచాలి. కొద్ది సమయం తర్వాత తీసి కళ్లమీద కొన్ని నిమిషాలపాటు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలను నిర్భందిస్తుంది.

చిట్కాలు :

కీరదోసకాయ : దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కంటి మీద పెట్టుకోవాలి. ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా తయారవుతాయి. దీనిలో చర్మాన్ని సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్, యంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

పాలు : దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో పఫీనెస్ తగ్గుతుంది. పాలను ఐస్‌ట్రేలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. రెండు గంటల తర్వాత ఐస్‌ట్రీ బయటికి తీసి మిల్క్ ఐస్‌క్యూబ్స్‌ను తీసి కాటన్ బట్టలో చుట్టి కళ్లు ఉబ్బున్న ప్రదేశంలో ఐప్లె చేస్తూ మర్దన చేయాలి. ఈ రెమెడీని ప్రతిరోజూ చేస్తే మంచిది.

Admin

Recent Posts