వినోదం

బాహుబలి 3 గురించి రాజమౌళి అప్పుడే హింట్ ఇచ్చారు గా..! మీరు గుర్తు పట్టారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన చిత్రం బాహుబలి&period; ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి రెండు పార్టులుగా తెరకెక్కించారు&period; యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం&comma; రానా&comma; అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించగా&period;&period; రాజమౌళి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ à°² జాబితాలో చేరిపోయాడు&period; ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది&period; బాహుబలి ది బిగినింగ్&comma; ది కంక్లూజన్ పేరుతో రెండు భాగాలు రాగా&period;&period; మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న మొదలైంది&period; ఇక రెండవ భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది&period; పార్ట్ 2 కూడా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా బాహుబలి 3 రాబోతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది&period; గతంలో ఓ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పారు&period; కానీ దీనికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు&period; ఆ తర్వాత మూడో భాగంపై ఎన్ని పుకార్లు వచ్చినా రాజమౌళి కూడా వీటిపై స్పందించలేదు&period; అయితే గ‌తంలో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జ‌రిగిన‌ మూవీ మారథాన్ కార్యక్రమంలో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్&comma; బాహుబలి&comma; ఈగ చిత్రాలను ప్రదర్శించారు&period; ఈ కార్యక్రమంలో జక్కన్న కూడా పాల్గొన్నారు&period; అయితే ఈ కార్యక్రమంలోనే జక్కన్నకు బాహుబలి పార్ట్ 3 కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82476 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;baahubali-1&period;jpg" alt&equals;"is baahubali movie coming sooner or later " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ఆయన తాను చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పారు&period; అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే జక్కన్న ఆ సంభాషణను పెట్టారు&period; ఆ సంభాషణ స్వామీజీ పాత్రధారి తనికెళ్ల భరణికి&comma; చిన్నారి మధ్య జరుగుతుంది&period; ఆ స్వామీజీని చిన్నారి&period;&period; తాత&period;&period; మహేంద్ర బాహుబలి కొడుకు రాజు అయ్యాడా అని అడుగుతుంది&period; దానికి&period;&period; ఏమో&period;&period; శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక అని బదులిస్తారు&period; దీన్నిబట్టి మూడో పార్ట్ గురించి రాజమౌళి ముందే హింట్ ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి&period; ఓ నెటిజన్ దీనిని షేర్ చేసి బాహుబలి 3 రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చాడు&period; అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావ‌ల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts